Politicsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-devara9fd75533-de7a-4261-a659-cd20e9c73eae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-devara9fd75533-de7a-4261-a659-cd20e9c73eae-415x250-IndiaHerald.jpgయంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా ‘దేవర’. తార‌క్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. దాదాపు ఏడాదిన్న‌ర త‌ర్వాత ఎన్టీఆర్ మ‌ళ్లీ షూటింగ్ చేస్తోన్న సినిమా ఈ ‘దేవర’. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా రోజులు పాటు వెయిట్ చేశారు. మంచి క‌థ కుదిరే వర‌కు ఎవ‌రు ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా, తొంద‌ర పెట్టినా ఆయ‌న కూల్‌గా ఉంటూ వ‌చ్చారు. పెరిగిన ఇమేజ్ దృష్ట్యా మంచి స్క్రిప్ట్‌తోనే ఆడియెన్స్‌ను ఆయ‌న అల‌రించా#devara{#}Viswak sen;lord siva;Hollywood;Industry;Saif Ali Khan;Shiva;koratala siva;RRR Movie;NTR;bollywood;festival;News;Jr NTR;India;Cinemaదేవర : తాత పాత్రలో ఎన్టీఆర్.. అసలు ట్విస్ట్ అదేనా..?దేవర : తాత పాత్రలో ఎన్టీఆర్.. అసలు ట్విస్ట్ అదేనా..?#devara{#}Viswak sen;lord siva;Hollywood;Industry;Saif Ali Khan;Shiva;koratala siva;RRR Movie;NTR;bollywood;festival;News;Jr NTR;India;CinemaThu, 12 Sep 2024 22:08:00 GMTయంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా ‘దేవర’. తార‌క్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. దాదాపు ఏడాదిన్న‌ర త‌ర్వాత ఎన్టీఆర్ మ‌ళ్లీ షూటింగ్ చేస్తోన్న సినిమా ఈ ‘దేవర’. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా రోజులు పాటు వెయిట్ చేశారు. మంచి క‌థ కుదిరే వర‌కు ఎవ‌రు ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా, తొంద‌ర పెట్టినా ఆయ‌న కూల్‌గా ఉంటూ వ‌చ్చారు. పెరిగిన ఇమేజ్ దృష్ట్యా మంచి స్క్రిప్ట్‌తోనే ఆడియెన్స్‌ను ఆయ‌న అల‌రించాల‌ని అనుకున్నారు.‘దేవర’ సినిమాపై ఎలాంటి అంచ‌నాలుంటాయ‌నే సంగ‌తి తార‌క్‌కి బాగా తెలుసు. అదీ కాకుండా పాన్ ఇండియా మూవీ కావ‌టంతో సినిమా కోసం ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో అన్నింటినీ తీసుకుంటూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అనిరుద్‌, ర‌త్న‌వేలు, శ్రీక‌ర్ ప్ర‌సాద్ వంటి టాప్ టెక్నీషియ‌న్స్ వ‌ర్క్ చేస్తున్నారు. వీరితో పాటు హాలీవుడ్ టెక్నిషియ‌న్స్ సైతం యాక్ష‌న్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్ వ‌ర్క్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మొక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. అదేంటంటే..‘దేవర’ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే దేవరలో ఈ రెండు పాత్రలు కాకుండా మరో పాత్ర ఉంటుందని మూడో పాత్ర తాత పాత్ర అని ప్రచారం జరుగుతోంది.ట్రైలర్ లోని ఒక షాట్ లో మండుతున్న కత్తులు పట్టుకుని ఉన్న షాట్ లో మరో ఎన్టీఆర్ కనిపిస్తారని క్లైమాక్స్ లో ఆ పాత్ర ఎంట్రీ ఉంటుందని సమాచారం అందుతోంది. దేవర సినిమా ట్విస్టుల గురించి వైరల్ అవుతున్న వార్తలు ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. దేవరలో మూడో వాడు ఉంటే మాత్రం సంచలనం అవుతుంది. కొరటాల శివసినిమా విషయంలో ఎలా ప్లాన్ చేశారో తెలియాల్సి ఉంది.

 దేవర సినిమాలో ఊహించని ట్విస్టులకు అయితే లోటు ఉండదని తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తారక్ బిజీ కావాలని ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తుండగా దేవర సినిమాలో తారక్ లుక్స్ విషయంలో కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తుండగా అలా ట్రోల్స్ చేస్తున్న వాళ్లకు విశ్వక్ సేన్ తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. దేవర సినిమాపై ఇండస్ట్రీ సైతం చాలా ఆశలు పెట్టుకుంది.‘దేవర’ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా కనిపించ‌బోతున్నారు. ఈ సినిమా ఇప్ప‌టికే ప్రమోషన్స్ లో జోరందుకుంటుంది.అంతే కాకుండా 'దేవర' రన్టైమ్2 గంటల 57 నిమిషాలు ఉన్నట్లు టాక్.కాగా ఇందులో విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయని, చివరి 40 నిమిషాలు సినిమాలో హైలైట్ ఉంటుందని సెన్సార్ బోర్డ్ చెప్పినట్లు టాక్ రావడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>