MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-letest-update-fresh-newseca662cd-696c-408f-9211-da87d6aa0edd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-letest-update-fresh-newseca662cd-696c-408f-9211-da87d6aa0edd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజమౌళి ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. రాజమౌళి ఆఖరుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఏకంగా ఆస్కార్ అవార్డుని దక్కించుకుంది. ఈ సినిమాతో రాజమౌళి కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇంత గొప్ప గుర్తింపును సంపాదించుకున్న రRajamouli{#}mahesh babu;Pawan Kalyan;rana daggubati;Rajamouli;sree;Matthu Vadalara;Mathu Vadalara;Oscar;Jr NTR;Cinema;septemberఆ విషయం అడిగినందుకు ఆ హీరోను కర్రతో కొట్టబోయిన రాజమౌళి.. కారణం ఏంటో తెలుసా..?ఆ విషయం అడిగినందుకు ఆ హీరోను కర్రతో కొట్టబోయిన రాజమౌళి.. కారణం ఏంటో తెలుసా..?Rajamouli{#}mahesh babu;Pawan Kalyan;rana daggubati;Rajamouli;sree;Matthu Vadalara;Mathu Vadalara;Oscar;Jr NTR;Cinema;septemberThu, 12 Sep 2024 04:30:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజమౌళి ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. రాజమౌళి ఆఖరుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఏకంగా ఆస్కార్ అవార్డుని దక్కించుకుంది. ఈ సినిమాతో రాజమౌళి కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇంత గొప్ప గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి తన తదుపరి మూవీ ని మహేష్ బాబు తో చేయబోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా పనులు పూర్తి అయిన రాజమౌళి మాత్రం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పక్కాగా పూర్తి అయిన తర్వాతే సినిమాను మొదలు పెట్టే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తుంది. దానితో ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్లను కూడా విడుదల చేయడం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ సింహ హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా రితీష్ రానా దర్శకత్వంలో మత్తు వదలరా 2 అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంబర్ 13 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ సరికొత్తగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను చేస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా శ్రీ సింహ , రాజమౌళి ఇద్దరు మాట్లాడుకునే ఒక వీడియో బయటకు వచ్చింది.

అందులో శ్రీ సింహా , రాజమౌళి తో  వెళ్లే ముందు "SSRMB" అప్డేట్ ఏదైనా ఇవ్వచ్చు కదా అని అడిగాడు. దానితో ఏదైనా కర్ర ఉందా అని రాజమౌళి , శ్రీ సింహ తో అనగా , అతను ఒక చిన్న కర్రను తీసి రాజమౌళి కి ఇస్తాడు. దానితో కాదురా అంటూ పక్కనే ఉన్న ఒక పెద్ద కర్రను తీసుకొని రాజమౌళి , శ్రీ సింహాన్ని కొట్టడానికి చూస్తాడు. అప్డేట్లు కావాలి అంట ... అంటూ రాజమౌళి వెళ్లిపోతాడు. ఇలా శ్రీ సింహ "SSRMB" అప్డేట్ అడిగినందుకు పెద్ద కర్రతో రాజమౌళి సరదాగా శ్రీ సింహ ను కొట్టబోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>