MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kriti-shettycab8343d-917e-4001-9962-bed89dbc8de9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kriti-shettycab8343d-917e-4001-9962-bed89dbc8de9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ అందాల నటి కృతి శెట్టి గుర తెలుగు కుర్ర కారుకి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా ఉప్పెనతోనే కృతి తెలుగు కుర్ర కారు మనసులను ముంచేసింది. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నాలుగు సంవత్సరాల క్రితం రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమాకి ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డు కూడా లభించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన క్రితిశెట్టికి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత కాలంలో కృతి వెనక్కి తిరిగి చKriti Shetty{#}Car;Hyderabad;sukumar;Heroine;Telugu;media;Cinema;Indian;bollywoodతెలుగు చిత్ర పరిశ్రమపై ప్రేమను చాటుకున్న కృతి శెట్టి!తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రేమను చాటుకున్న కృతి శెట్టి!Kriti Shetty{#}Car;Hyderabad;sukumar;Heroine;Telugu;media;Cinema;Indian;bollywoodWed, 11 Sep 2024 15:30:00 GMTటాలీవుడ్ అందాల నటి కృతి శెట్టి గుర తెలుగు కుర్ర కారుకి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా ఉప్పెనతోనే కృతి తెలుగు కుర్ర కారు మనసులను ముంచేసింది. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నాలుగు సంవత్సరాల క్రితం రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమాకి ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డు కూడా లభించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన క్రితిశెట్టికి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత కాలంలో కృతి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాలను చేసుకుంటూ పోయింది. అయితే ఉప్పెన సినిమా ఆడినంత స్థాయిలో మిగతా సినిమాలో ఆడక పోవడం దురదృష్టకరం అని చెప్పుకోవాలి.

ఇక అసలు విషయంలోకి వెళితే... ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఓవైపు తెలుగు సినిమాలు చేస్తూనే, బాలీవుడ్ పై కూడా ఓ కన్నేసింది. ప్రస్తుతం ఆమెకే అక్కడ చేతినిండా సినిమాలు ఉన్నాయి. వాటితో పాటు ఈ అమ్మడు మలయాళం లో కూడా సినిమాలు చేస్తుంది. ఒక మలయాళ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన కృతి, తాజాగా ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమని మర్చిపోలేనని, హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నా పుట్టింటికి వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది. దాంతో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తాను ఏ భాషలో సినిమా చేసినా, అవి తెలుగులో విడుదలైనప్పుడు, ఇక్కడి వారు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు కృతి శెట్టి. ఇక ఈ సందర్భంగా సదరు యాంకర్, ప్రస్తుతం మీరు తెలుగులో ఏ ఏ సినిమాలు చేస్తున్నారు? అనే ప్రశ్న అడగడంతో... సమాధానం చెబుతూ ఆమె, ప్రస్తుతం నేను తెలుగులో డజను సినిమాలకు పైగా సైన్ చేశాను. అందులో రెండు మూడు సినిమాలు షూటింగులో దశలో ఉన్నాయి. వాటి వివరాలను ఆయా చిత్రాల యూనిట్స్ త్వరలోనే వెల్లడిస్తాయి... అంటూ చెప్పుకొచ్చింది. ఇకపోతే 22 ఏళ్ల క్రితిశెట్టి మొదటి సినిమాతోనే తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలో ఒక్క తెలుగుతోనే సరిపెట్టుకోకుండా మిగిలిన ఇండియన్ భాషల్లో అన్నింటిలో కూడా తన సత్తాను చాటే పనిలో పడింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>