MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan1a7daade-e2d2-4f6a-8834-6cf2bf852e98-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan1a7daade-e2d2-4f6a-8834-6cf2bf852e98-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్ గా వీరభద్రం దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం గుడుంబా శంకర్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి విలన్ పాత్రలో నటించగా ... ఆలీ , బ్రహ్మానందం ముఖ్య పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమా 2004 వ సంవత్సరం సెప్టెంబర్ 10 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో 20 సంవతPawan{#}Meera;ali reza;cinema theater;Traffic police;Nagababu;Gudumba Shankar;Ashish Vidyarthi;Veerabhadram Chowdary;Comedy;Brahmanandam;Success;Box office;kalyan;Heroine;Cinema;september20 ఏళ్ల గుడుంబా శంకర్.. అంచనాలను ఎందుకు అందుకోలేదు.. వచ్చిన కలెక్షన్స్ ఇవే..?20 ఏళ్ల గుడుంబా శంకర్.. అంచనాలను ఎందుకు అందుకోలేదు.. వచ్చిన కలెక్షన్స్ ఇవే..?Pawan{#}Meera;ali reza;cinema theater;Traffic police;Nagababu;Gudumba Shankar;Ashish Vidyarthi;Veerabhadram Chowdary;Comedy;Brahmanandam;Success;Box office;kalyan;Heroine;Cinema;septemberWed, 11 Sep 2024 11:30:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్ గా వీరభద్రం దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం గుడుంబా శంకర్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి విలన్ పాత్రలో నటించగా ... ఆలీ , బ్రహ్మానందం ముఖ్య పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమా 2004 వ సంవత్సరం సెప్టెంబర్ 10 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో 20 సంవత్సరాలు పూర్తి అయింది.

సినిమా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలను , అలాగే ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం. ఇకపోతే గుడుంబా శంకర్ సినిమా మంచి ఎంటర్టైనర్ మూవీ అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకో పోవడానికి ప్రధాన కారణం ఈ మూవీ పై భారీ అంచనాలు ఉండడమే. ఈ సినిమాలోని పోస్టర్లలో పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ లో ఉండడంతో ఇది పవర్ఫుల్ పోలీస్ స్టోరీ అని చాలా మంది అనుకున్నారు. ఇక థియేటర్ కి వెళ్లి సినిమా మొదలయ్యాక ఇది పవర్ ఫుల్ పోలీస్ స్టోరీ కాదు. కామెడీ ఎంటర్టైనర్ మూవీ అని తెలియడంతో జనాలు కాస్త అప్సెట్ అయ్యారు. దాని ద్వారా ఈ మూవీ కి నెగటివ్ టాక్ వచ్చింది.

కానీ ఈ సినిమా కామెడీ విషయంలో సూపర్ గా సక్సెస్ అవ్వడంతో చివరగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అప్పట్లోనే 16 కోట్ల షేర్ కలక్షన్లను రాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ సోదరుడు అయినటువంటి నాగబాబు ఈ మూవీ ని అంజన ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించాడు. ఇక 20 సంవత్సరాలు పూర్తి అయిన ఈ సినిమా టీవీ లో ప్రసారం అయినప్పుడు మంచి "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంటుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>