MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samanthad06f5271-30e0-45c6-9a79-625baedaa25e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samanthad06f5271-30e0-45c6-9a79-625baedaa25e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ తార శోభిత ధూళిపాళ... నటిగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అడవి శేషుతో కలిసి గూడాచారి, మేజర్ వంటి సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. గత కొద్దిరోజుల క్రితం వచ్చిన పోన్నియిన్ సెల్వన్ సినిమాతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. తెలుగులోనే కాకుండా హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది. ఇదిలా ఉండగా.... శోభిత ధూళిపాళ్ల గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దీనికి గల కారణం.... శోభిత, నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరsamantha{#}tara;shobitha;Samantha;Naga Chaitanya;Newsసమంత గెస్ట్‌ హౌజ్‌ కు శోభిత..కారణం ఇదే ?సమంత గెస్ట్‌ హౌజ్‌ కు శోభిత..కారణం ఇదే ?samantha{#}tara;shobitha;Samantha;Naga Chaitanya;NewsWed, 11 Sep 2024 16:27:00 GMTటాలీవుడ్‌ తార శోభిత ధూళిపాళ... నటిగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అడవి శేషుతో కలిసి గూడాచారి, మేజర్ వంటి సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. గత కొద్దిరోజుల క్రితం వచ్చిన పోన్నియిన్ సెల్వన్ సినిమాతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. తెలుగులోనే కాకుండా హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది. ఇదిలా ఉండగా.... శోభిత ధూళిపాళ్ల గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దీనికి గల కారణం.... శోభిత, నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరగడం.


వీరిద్దరికి సంబంధించి గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, రిలేషన్ కొనసాగిస్తున్నారంటూ అనేక రకాల వార్తలు వచ్చినప్పటికీ వీటిపై ఇరువురు స్పందించలేదు. గత కొద్ది రోజుల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. మరికొద్ది రోజుల్లోనే వీరి వివాహం జరగనుంది. వీరి వివాహం కోసం కుటుంబ సభ్యులు ఇప్పటికే వివాహ వేదికను వెతికే పనిలో ఉన్నారట. అంతేకాకుండా వివాహాన్ని చాలా గ్రాండ్ గా జరిపించాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అందరిని పిలవాలని ఫిక్స్ అయ్యారట. ఇదిలా ఉండగా... అక్కినేని నాగచైతన్య సమంత ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.


ఏవో కొన్ని మనస్పర్ధలు కారణంగా కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకులు అనంతరం నాగచైతన్య శోభితతో రిలేషన్ కొనసాగించి మళ్లీ వివాహం చేసుకోబోతున్నాడు. కానీ సమంత సింగిల్ గానే ఉంది. అయితే శోభిత నాగచైతన్య వారి వివాహానికి ప్రతి ఒక్కరిని పిలవాలని అనుకున్నార మరి అందులో సమంతని కూడా పిలవాలని అనుకుంటున్నారట.

దీంతో శోభిత సమంత వద్దకు వెళ్లి వారి వివాహానికి ఆహ్వానించాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇన్ని రోజులు జరిగింది ఏది పట్టించుకోకుండా వారి వివాహానికి రావాలని, ఎప్పటిలాగే అందరం కలిసి ఉండాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ విషయాన్ని నేరుగా శోభిత వెళ్లి సమంతకు చెప్పాలని ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>