ViralRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/india3cdd3780-4529-4728-a2d8-086f8965cd6e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/india3cdd3780-4529-4728-a2d8-086f8965cd6e-415x250-IndiaHerald.jpg ప్రకృతి సోయగాలు మన కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. స్విస్ అనగానే రాజకీయ నాయకుల బ్లాక్ మనీ ఆరోపణల ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటాయి. వీటన్నింటికీ మించి పర్యాటకులకు స్వర్గధామంగా నిలిచే ఈ చిన్న దేశం తాజాగా ఓ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా నిలిచింది. india{#}Switzerland;Indiaప్ర‌పంచంలోనే ది బెస్ట్ కంట్రీ తెలుసా... భార‌త్ ర్యాంక్ ఎంతంటే..?ప్ర‌పంచంలోనే ది బెస్ట్ కంట్రీ తెలుసా... భార‌త్ ర్యాంక్ ఎంతంటే..?india{#}Switzerland;IndiaWed, 11 Sep 2024 10:09:07 GMT- ( న్యూ ఢిల్లీ - ఇండియా హెరాల్డ్ ) .

ప్రపంచంలోనే ది బెస్ట్ కంట్రీ ఏంటి ? ప్రపంచంలోనే బెస్ట్ కంట్రీల జాబితాలో భారత్‌ ర్యాంకు ఎంత అన్నది పరిశీలిస్తే తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడి అయ్యాయి. స్విట్జర్లాండ్ ఈ పేరు వినగానే అందమైన ఆల్ఫ్స్‌ పర్వతాలు ... ప్రకృతి సోయగాలు మన కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. స్విస్ అనగానే రాజకీయ నాయకుల బ్లాక్ మనీ ఆరోపణల ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటాయి. వీటన్నింటికీ మించి పర్యాటకులకు స్వర్గధామంగా నిలిచే ఈ చిన్న దేశం తాజాగా ఓ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా నిలిచింది.


యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ 2024లో స్విట్జర్లాండ్ అగ్రస్థానం దక్కించుకుంది. వరుసగా మూడో ఏడాది ఈ దేశం నెంబర్ వన్ గా నిలవడం విశేషం. సాహసం -  -వారసత్వం వ్యాపార అవకాశాలు ... జీవన నాణ్యత - సంస్కృతి .. సాంప్రదాయాలతో పాటు అనేక అంశాలు ఆధారంగా చేపట్టిన ఈ ర్యాంకులను రిలీజ్ చేశారు. మొత్తం 89 దేశాలతో ఈ జాబితాను రూపొందించారు. అత్యధిక విభాగాలలో స్విట్జర్లాండ్ లో చాలా ఉన్నతమైన ప్రమాణాలు ఉండడంతో ఈ జాబితాలో స్విట్జర్లాండ్ తొలిస్థానం దక్కించుకుంది.


ఇప్పటివరకు మొత్తంగా ఏడుసార్లు స్విట్జ్‌ర్లాండ్ బెస్ట్ కంట్రీ గా నెంబర్ వన్ ర్యాంక్ సాధించింది. ఇక ఈ జాబితాలో ఆసియా దేశమైనా జపాన్‌ రెండో స్థానంలో ఉంటే అమెరికా - కెనడా - ఆస్ట్రేలియా తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. భారత 33వ స్థానంలో ఉంది. గత ఏడాదితో పోలిస్తే మన దేశం మూడు స్థానాలు కిందకు దిగజారిపోవడం విచిత్రం. ఆసియా నుంచి జపాన్ - సింగపూర్ - చైనా - దక్షిణ కొరియా మాత్రమే ఇప్పటివరకు టాప్ 25 లో చోటు దక్కించుకోగలిగాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>