MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/koratalaf22ac1a8-4a15-4ff6-93e6-6eb7f29dd21c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/koratalaf22ac1a8-4a15-4ff6-93e6-6eb7f29dd21c-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు అత్యంత సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను ముందుకు సాగించిన వారిలో కొరటాల శివ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలకు కథలను అందించారు. ఈయన కథలను అందించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఆ తర్వాత ఈయన మిర్చి మూవీతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత వరుసగా ఈయన శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడంతోKoratala{#}Srimanthudu;Chiranjeevi;Mirchi;Bharath Ane Nenu;Bharat Ane Nenu;Ram Charan Teja;Tollywood;Success;Pawan Kalyan;Box office;koratala siva;NTR;Blockbuster hit;Cinemaకొరటాలని వెంటాడుతున్న పాదఘట్టం.. దేవర పై ఫుల్ ప్రభావం..?కొరటాలని వెంటాడుతున్న పాదఘట్టం.. దేవర పై ఫుల్ ప్రభావం..?Koratala{#}Srimanthudu;Chiranjeevi;Mirchi;Bharath Ane Nenu;Bharat Ane Nenu;Ram Charan Teja;Tollywood;Success;Pawan Kalyan;Box office;koratala siva;NTR;Blockbuster hit;CinemaWed, 11 Sep 2024 15:15:00 GMTసినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు అత్యంత సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను ముందుకు సాగించిన వారిలో కొరటాల శివ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలకు కథలను అందించారు. ఈయన కథలను అందించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఆ తర్వాత ఈయన మిర్చి మూవీతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత వరుసగా ఈయన శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుల స్థాయికి చేరుకున్నాడు. 

ఇక అద్భుతమైన స్థాయిలో కెరియర్ను ముందుకు సాగుతున్న సమయంలోనే కొరటాల శివ , మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఘోరపరాజయాన్ని ఎదుర్కొంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి , రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాలో చిరంజీవి , రామ్ చరణ్ ఇద్దరూ కూడా పాదఘట్టం అనే ప్రాంతం గురించి పోరాడుతూ ఉంటారు. ఇక ప్రేక్షకులకు ఈ సినిమాలోని కంటెంట్ ఏ మాత్రం నచ్చలేదు. దానితో పాదఘట్టం అనే పేరు కూడా తెగ వైరల్ అయింది. కొరటాల "ఆచార్య" లాంటి డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ తో దేవర మూవీని రూపొందించాడు.

మూవీ సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానుంది. దానితో నిన్న ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ లోని సన్నివేశాలను ఆచార్య మూవీలోని సన్నివేశాలను పక్కపక్కన పెడుతూ కొంత మంది ఇది మరో పాదఘట్టం కానుందా ..? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక మరో కొంత మంది మాత్రం ఆచార్య విషయంలో తప్పు జరిగింది. కానీ కొరటాల వేరే ఏ సినిమా విషయంలో తప్పులు చేయలేదు. మళ్ళీ దేవర తో ఆయన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటాడు అని ఆయనపై ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి దేవర సినిమా మరో ఆచార్య లాగా మిగిలిపోతుందా ..? లేక కొరటాల పూర్వపు సినిమాల లాగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>