MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/l-prashant-neel-2e2e4c8a-c952-473c-96f6-6243c0a7b7af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/l-prashant-neel-2e2e4c8a-c952-473c-96f6-6243c0a7b7af-415x250-IndiaHerald.jpgదర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి భారతీయ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. కే జి ఎఫ్ అనే కన్నడ ప్రాంతీయ భాష సినిమాతో యావత్ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకునేలా చేశాడు ప్రశాంత్. ఇక ఆ సినిమాలో హీరోగా నటించిన యష్ రాత్రికి రాత్రే బడా హీరోగా అవతరించాడు. ఈ క్రమంలో ప్రశాంత్ దర్శకత్వంలో సినిమాలు చేయాలని ఎంతోమంది సూపర్ స్టార్స్ క్యూలు కడుతున్న పరిస్థితి. ఇక కే జి ఎఫ్ తర్వాత ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ సలార్ అనే సినిమా చేసి, తన సత్తాని మరో మారు చాటుకున్నాడు. త్వరలో సలార్ రెండవl Prashant Neel {#}ajith kumar;prashanth neel;Prasanth Neel;Ajit Pawar;Yash;Prashant Kishor;prasanth;Kannada;raja;Prabhas;Tamil;Jr NTR;India;Darsakudu;Hero;Director;Cinemaప్రశాంత్ నీల్ ఆ నలుగురిలో ఎవరికి ముందుగా అవకాశం ఇస్తాడో?ప్రశాంత్ నీల్ ఆ నలుగురిలో ఎవరికి ముందుగా అవకాశం ఇస్తాడో?l Prashant Neel {#}ajith kumar;prashanth neel;Prasanth Neel;Ajit Pawar;Yash;Prashant Kishor;prasanth;Kannada;raja;Prabhas;Tamil;Jr NTR;India;Darsakudu;Hero;Director;CinemaWed, 11 Sep 2024 16:03:00 GMTదర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి భారతీయ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. కే జి ఎఫ్ అనే కన్నడ ప్రాంతీయ భాష సినిమాతో యావత్ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకునేలా చేశాడు ప్రశాంత్. ఇక ఆ సినిమాలో హీరోగా నటించిన యష్ రాత్రికి రాత్రే బడా హీరోగా అవతరించాడు. ఈ క్రమంలో ప్రశాంత్ దర్శకత్వంలో సినిమాలు చేయాలని ఎంతోమంది సూపర్ స్టార్స్ క్యూలు కడుతున్న పరిస్థితి. ఇక కే జి ఎఫ్ తర్వాత ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ సలార్ అనే సినిమా చేసి, తన సత్తాని మరో మారు చాటుకున్నాడు. త్వరలో సలార్ రెండవ భాగం తెరకెక్కనుంది.

ఈ నేపథ్యంలోనే దర్శకుడు ప్రశాంత్ నీల్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. విషయం ఏమిటంటే.. ప్రస్తుతం ప్రశాంత్ డైరీలో నలుగురు హీరోలు సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో ఒకరు యష్, రెండవది ప్రభాస్, మూడవది ఎన్టీఆర్, నాలుగో హీరో అజిత్. అయితే వీరిలో మొదటిగా ఎవరితో ప్రశాంత్ సినిమా చేయబోతాడు అనేదే ప్రస్తుతం చిక్కు విడవని ప్రశ్నగా తయారయింది అంటూ... ఆయా హీరోల అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా పూర్తి చేసుకుని, ప్రశాంత్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. అదేవిధంగా ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాలో నటిస్తూనే ప్రశాంత్ పిలుపు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక హీరో యష్ గురించి చెప్పాల్సిన పని లేదు... ప్రశాంత్ ఎప్పుడు పిలుస్తాడని కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురుచూస్తున్నాడు. తమిళ్ హీరో అజిత్ కూడా ప్రశాంత్ దర్శకత్వంలో సినిమాను చేయాలని తెగ ఉబలాటపడుతున్నాడు. అయితే మొట్టమొదటిగా ప్రశాంత్ ఈ నలుగురిలో ఏ హీరోతో సినిమాను మొదలుపెడతాడా అని ఆయా సినిమా హీరోల అభిమానులు కాకుల్లాగా ఎదురుచూస్తున్నారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>