LifeStyleVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/aashna-chaudhary0f0e9a00-4751-4c0a-a542-365a75d9d8e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/aashna-chaudhary0f0e9a00-4751-4c0a-a542-365a75d9d8e5-415x250-IndiaHerald.jpgప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. చాలామంది వారి లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం కష్టపడుతూ ఉంటారు. వారు అనుకున్న గోల్ రీచ్ అయ్యాక వారి కష్టమంతా మరిచిపోయి హ్యాపీగా ఉంటారు. ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మొదట కెరీర్ లో మోడలింగ్ రంగాన్ని ఎంచుకున్న ఓ యువతీ ఆ తర్వాత తనకు ఇష్టమైన మోడలింగ్ ను వదిలేసి సివిల్ సర్వెంట్ కావాలని అనుకుంది. Aashna Chaudhary{#}Master;jeevitha rajaseskhar;choudary actorఅప్పుడు హాట్‌ అందలతో రెచ్చిపోయింది....ఇప్పుడు ఓ ఐపీఎస్ ?అప్పుడు హాట్‌ అందలతో రెచ్చిపోయింది....ఇప్పుడు ఓ ఐపీఎస్ ?Aashna Chaudhary{#}Master;jeevitha rajaseskhar;choudary actorWed, 11 Sep 2024 13:51:00 GMTప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. చాలామంది వారి లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం కష్టపడుతూ ఉంటారు. వారు అనుకున్న గోల్ రీచ్ అయ్యాక వారి కష్టమంతా మరిచిపోయి హ్యాపీగా ఉంటారు. ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మొదట కెరీర్ లో మోడలింగ్ రంగాన్ని ఎంచుకున్న ఓ యువతీ ఆ తర్వాత తనకు ఇష్టమైన మోడలింగ్ ను వదిలేసి సివిల్ సర్వెంట్ కావాలని అనుకుంది.


ఇక అంతే ఎంతో కష్టపడి ఐపీఎస్ అధికారిగా ఎంపికైంది. ప్రస్తుతం ఈమె లైఫ్ స్టోరీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా మారుతోంది. ఉత్తరప్రదేశ్లోని పిల్కువాకు చెందిన ఆష్నా చౌదరి డిగ్రీ పూర్తి చేసుకుంది. ఈమె ఫ్యాషన్స్ పర్యాటక కేంద్రాల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటుంది. అలా ఆమెకు కొన్ని సంస్థల నుంచి మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. కొంతకాలం మోడలింగ్ రంగంలో రాణించాక ఉన్నట్టుండి ఆ రంగాన్ని వదిలేసిన ఆష్నా చౌదరి 2022లో సివిల్స్ పరీక్ష రాసి ఆలిండియా 116వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ గా ఎంపికైంది.

నిజానికి సివిల్స్ నిర్ణయం తీసుకున్నాక తనకు ఎంతో ఇష్టమైన మోడలింగ్ రంగాన్ని పక్కన పెట్టింది. 2019లో సివిల్స్ రాస్తే ప్రిలిమ్స్ లోనే పోయింది. ఆ సమయంలో నేను దేనికి పనికిరానా అని బాధపడిందట. ఇంట్లో వాళ్ళు కూడా సివిల్స్ వదిలేస్తుందని అనుకున్నారు. కానీ ఒక్క ప్రయత్నానికి ఎందుకు వెనుదిరుగాలి అని రెండోసారి రాస్తే ప్రయత్నం చేసిందట. ఈసారి 2.5 మార్కులతో మళ్ళీ ప్రిలిమ్స్ చేజారిపోయిందట. ఈసారి దిగులు పడకుండా తక్కువ మార్కులతో పోయిందంటే నేను సరైన మార్గంలో వెళుతున్నట్టే అనే ఉత్సాహంగా ప్రయత్నించి 2022లో ఏకంగా 116వ ర్యాంకు సంపాదించింది.


ఓ వైపు ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మాస్టర్ చేస్తూనే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యింది. అలాగని ఆ సమయంలో తన అభిరుచి అయిన విహారాలను పక్కన పెట్టకుండా సన్నద్ధత మధ్యలో విరామాలు తీసుకొని మళ్లీ వెళ్లొచ్చేవారట. ఆ వివరాలతోపాటు స్ఫూర్తి నింపే అంశాలను ఇన్ స్టాలో పంచుకునేవారు. అలా విపరీతంగా ఆష్నాకు ఫ్యాన్స్ పెరిగారు. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన నిజ జీవిత కథ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>