MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samyuktha-menonc5748c5f-d2e8-4a8f-b8fd-c085b9ff9071-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samyuktha-menonc5748c5f-d2e8-4a8f-b8fd-c085b9ff9071-415x250-IndiaHerald.jpgహీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్న హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటి హీరోయిన్లలో సంయుక్త మీనన్ ఒకరు. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా పరిచయమైన సంయుక్త తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే సంయుక్తకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ సినిమా అనంతరం సార్ సినిమాలో హీరోయిన్గా నటించి ప్రతి ఒక్క కుర్రాడి కలల రాకుమారిగా మారింది. samyuktha menon{#}Amarnath K Menon;prema;Nayak;Ishtam;kalyan;Love;BEAUTY;media;Nijam;Hero;Cinemaపెళ్లయిన హీరోతో రిలేషన్ లో సంయుక్త మీనన్?పెళ్లయిన హీరోతో రిలేషన్ లో సంయుక్త మీనన్?samyuktha menon{#}Amarnath K Menon;prema;Nayak;Ishtam;kalyan;Love;BEAUTY;media;Nijam;Hero;CinemaWed, 11 Sep 2024 13:46:00 GMTహీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్న హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటి హీరోయిన్లలో సంయుక్త మీనన్ ఒకరు. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా పరిచయమైన సంయుక్త తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే సంయుక్తకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ సినిమా అనంతరం సార్ సినిమాలో హీరోయిన్గా నటించి ప్రతి ఒక్క కుర్రాడి కలల రాకుమారిగా మారింది.


సినిమా అనంతరం వరుసగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్న సంయుక్త సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు వరుస పెట్టి ఫోటో షూట్లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం సంయుక్తకు సంబంధించిన ఓ వార్తా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.


బ్యూటీ కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోతో ప్రేమాయణం నడుపుతోందట. ఆ హీరోకి ఇదివరకే ఓ అమ్మాయితో ప్రేమ పెళ్లి జరిగిందని... అంతేకాకుండా వారు విడాకులు కూడా తీసుకున్నారని సమాచారం. ఇక ఆ హీరో ఒప్పుకుంటే అతడిని వివాహం చేసుకోవాలని సంయుక్త ఫిక్స్ అయిందట. ఆ హీరోకి కూడా సంయుక్త అంటే విపరీతమైన ఇష్టం ఉందని టాక్. వీరిద్దరూ కలిసి గతంలో ఓ సినిమాలో నటించారట. ఆ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమ వరకు వెళ్లిందని టాక్.

ఈ విషయం తెలిసి సంయుక్త అభిమానులు కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో వివాహం చేసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. అది కూడా పెళ్లయిన ఓ వ్యక్తిని చేసుకోవడం అవసరమా అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>