MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb8e01884-59b0-42c7-8783-0d497f4480ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb8e01884-59b0-42c7-8783-0d497f4480ff-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో ఉన్న స్టార్ డైరెక్టర్ లలో ఒకరు ఓ వైపు చిరంజీవి కి మరో వైపు బాలయ్య కు ఇద్దరికి కూడా ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ దర్శకుడు ఎవరు ..? ఆ సినిమాలు ఏమిటి అనే వివరాలను తెలుసుకుందాం. నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో సమరసింహా రెడ్డి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసింది. దానితో ఈ సినిమా ఆల్ టైమ్ టTollywood{#}aarti agarwal;b gopal;indra;mani sharma;sonali bendre;Samarasimha Reddy;Narasimha Naidu;lion;Blockbuster hit;Industry;Box office;Balakrishna;Varsham;Tollywood;Telugu;Music;Darsakudu;Cinema;Chiranjeevi;Directorచిరు.. బాలయ్య ఇద్దరికీ ఆ డైరెక్టర్ ఎంతో స్పెషల్.. ఏకంగా ఇద్దరికి ఇండస్ట్రీ హిట్స్..?చిరు.. బాలయ్య ఇద్దరికీ ఆ డైరెక్టర్ ఎంతో స్పెషల్.. ఏకంగా ఇద్దరికి ఇండస్ట్రీ హిట్స్..?Tollywood{#}aarti agarwal;b gopal;indra;mani sharma;sonali bendre;Samarasimha Reddy;Narasimha Naidu;lion;Blockbuster hit;Industry;Box office;Balakrishna;Varsham;Tollywood;Telugu;Music;Darsakudu;Cinema;Chiranjeevi;DirectorTue, 10 Sep 2024 14:05:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో ఉన్న స్టార్ డైరెక్టర్ లలో ఒకరు ఓ వైపు చిరంజీవి కి మరో వైపు బాలయ్య కు ఇద్దరికి కూడా ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ దర్శకుడు ఎవరు ..? ఆ సినిమాలు ఏమిటి అనే వివరాలను తెలుసుకుందాం.

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో సమరసింహా రెడ్డి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసింది. దానితో ఈ సినిమా ఆల్ టైమ్ టాలీవుడ్ ఇందుస్టీ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ , బి గోపాల్ కాంబినేషన్లో నరసింహ నాయుడు అనే మూవీ రూపొందింది. ఈ సినిమాకు కూడా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఈ మూవీ కూడా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో ఇంద్ర మూవీ రూపొందింది. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించగా ... మణిశర్మమూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ కూడా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. ఇక ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కూడా టాలీవుడ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇలా తెలుగు సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాల పాటు టాప్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన బి గోపాల్ ఇటు బాలకృష్ణ తో 2 ఇండస్ట్రీ హిట్ మూవీలను తెరకెక్కించగా , చిరంజీవితో ఒక ఇండస్ట్రీ హిట్ మూవీ ని రూపొందించాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>