MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-8075572a5-0d24-44a1-ab26-9bfdde1fc158-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-8075572a5-0d24-44a1-ab26-9bfdde1fc158-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 8 చాలా రసవంతంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ నుండి మొదటివారం ఎలిమినేషన్ లో భాగంగా బెజవాడ బెబక్క బయటికి వచ్చిన సంగతి అందరికీ తెలిసింది. ఇక రెండో వారం ఎలిమినేషన్లు కూడా చాలా రసవంతంగా జరిగాయి. నామినేషన్ లో భాగంగా ముందుగా కిరాక్ సీతకు సోనియా మధ్య బాగా గొడవ జరిగింది. అనంతరం సోనియా సీతను నామినేట్ చేయగా.. చెప్పిన కారణానికి ఆమెపై విరుచుక పడింది. అనంతరం విష్ణుప్రియ సోనియాను నామినేట్ చేయగా.. ఎందుకు నామినేట్ చేయవలసి వచ్చిందన్న విషయం గురించి మాట్లాడుతూ... గతవారం జరిగినbiggboss 8{#}vishnu priya;Raccha;SoniaGandhi;war;Bigboss;Comedy;House;Yevaruబిగ్‌బాస్ 8: విష్ణుప్రియను సోనియా ఏం చేసింది... ఎంత ప‌ని చేసిందో చూడండి..!బిగ్‌బాస్ 8: విష్ణుప్రియను సోనియా ఏం చేసింది... ఎంత ప‌ని చేసిందో చూడండి..!biggboss 8{#}vishnu priya;Raccha;SoniaGandhi;war;Bigboss;Comedy;House;YevaruTue, 10 Sep 2024 11:45:00 GMTబుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 8 చాలా రసవంతంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ నుండి మొదటివారం ఎలిమినేషన్ లో భాగంగా బెజవాడ బెబక్క బయటికి వచ్చిన సంగతి అందరికీ తెలిసింది. ఇక రెండో వారం ఎలిమినేషన్లు కూడా చాలా రసవంతంగా జరిగాయి. నామినేషన్ లో భాగంగా ముందుగా కిరాక్ సీతకు సోనియా మధ్య బాగా గొడవ జరిగింది. అనంతరం సోనియా సీతను నామినేట్  చేయగా.. చెప్పిన కారణానికి ఆమెపై విరుచుక పడింది. అనంతరం విష్ణుప్రియ సోనియాను నామినేట్ చేయగా.. ఎందుకు నామినేట్ చేయవలసి వచ్చిందన్న విషయం గురించి మాట్లాడుతూ... గతవారం జరిగిన గురించి తెలియజేస్తూ., నిఖిల్ ఇష్యూ గురించి మాట్లాడుతూ నేను అన్న దానికి సారీ చెప్పా.. కానీ., నాపైన అడల్ట్రీ అనే ముద్ర వేశారు మీరు.. దానికి నాకు సారీ చెప్పలేదు అని విష్ణుప్రియ చెప్పింది.

దానికి సోనియా వాదించింది. నీకు అది కామెడీ ఏమో కానీ నాకు కాదు.. మన ఇద్దరి మధ్య ఆ ర్యాపో లేదు.. నాకు అది అడల్ట్రీనే.. అని సోనియా సీరియస్ గా చెప్పింది. నేను ఏం అడల్ట్రీ జోక్స్ వేశా.? అంటూ విష్ణు ప్రియ వాదించడం మొదలు పెట్టింది.. మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేంత గొప్పదాన్ని కాదు.. అంటూ సోనియా వాదించి.  ఇలా వారిద్దరి మధ్య వాదన జరిగిన తర్వాత సోనియా బ్యాలెన్స్ తప్పి నీకు బట్టలు వేసుకోవడం కూడా సరిగ్గా రాదు.. ఒక మనిషి పక్కన నిల్చోవాలన్నది కూడా నీకు తెలియదు. నీ మాటలు, చేతలు హౌస్ లో అందరికీ అలానే అనిపిస్తున్నాయి అంటూ సోనియా మండిపడింది విషుప్రియ పై..

అయితే ఇందుకు విష్ణుప్రియ కూడా గట్టిగా కౌంటర్ ఇస్తూ ఎవరు నా వల్ల అలా ఫీల్ అయ్యారో వాళ్లు చెబుతారు.. వాళ్ల గురించి మీరెందుకు చెప్పడం.. దేవుడిచ్చిన జ్ఞానాన్ని, విద్యని కరెక్ట్‌గా వాడాలి అంటూ విష్ణుప్రియ తెలియజేసింది. ఈ  క్రమంలో సీత, విష్ణు ప్రియ ఇద్దరు కూడా సోనియా పై మండి పడ్డారు. అయినా కానీ సోనియా కూడా ఏ మాత్రం తగ్గకుండా ఇద్దరిపై మాటలు యుద్ధం చేసింది. మొత్తానికి రెండో వారం నామినేషన్లు కూడా రచ్చ రచ్ఛగానే కొనసాగింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>