PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp058e97b7-57a4-4dc5-b77b-5fcc6f53a827-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp058e97b7-57a4-4dc5-b77b-5fcc6f53a827-415x250-IndiaHerald.jpg తెలుగుదేశం పార్టీ మాజీ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత బీజేపీ నేత విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే.. సుజనా చౌదరి ప్లెక్సీలు వేయించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఫ్లెక్సీలు వేసిన ప్లేస్ లోనే మరో ప్లెక్సీలు కనపడుతున్నాయి. అవే మా ఎమ్మెల్యే ఎక్కడ ? అని.. దీనిపై ఆసక్తికర చర్చ విజయవాడ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. bjp{#}MLA;YCPబెజ‌వాడ‌లో పొలిటిక‌ల్ వార్‌... బీజేపీ ఎమ్మెల్యే సుజ‌నాయే టార్గెట్ ..?బెజ‌వాడ‌లో పొలిటిక‌ల్ వార్‌... బీజేపీ ఎమ్మెల్యే సుజ‌నాయే టార్గెట్ ..?bjp{#}MLA;YCPTue, 10 Sep 2024 17:06:43 GMTవిజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే కోసం ప్రజలు కలవరిస్తున్నారు. నియోజకవర్గానికి తాను గెలిచిన వెంటనే అన్నీ చేశానని.. ఎన్నో చేస్తున్నానని. తెలుగుదేశం పార్టీ మాజీ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత బీజేపీ నేత విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే.. సుజనా చౌదరి ప్లెక్సీలు వేయించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఫ్లెక్సీలు వేసిన ప్లేస్ లోనే మరో ప్లెక్సీలు కనపడుతున్నాయి. అవే మా ఎమ్మెల్యే ఎక్కడ ? అని.. దీనిపై ఆసక్తికర చర్చ విజయవాడ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.


వాస్తవానికి అప్పట్లో సుజనా చౌదరి ఏ ఏ ప్రాంతాల్లో తనకు అనుకూలంగా ఫ్లెక్సీలు కట్టించారో.. ఇప్పుడు అక్కడే ఆ వార్డుకు చెందిన ప్రజలు ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఇది సహజంగానే సోష‌ల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా బుడమేరు పొంగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలు సగానికి పైగా శివారు ప్రాంతాలు మునిగిపోయాయి. ఎనిమిది రోజులుగా వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ప్రభుత్వ యంత్రాంగం అక్కడే మకాం వేసి వారిని ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.


పీక‌ల్లోతు నీటిలో వెళ్ళలేక సహాయ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ప్రజలకు ఒక పూట తింటే.. మరో పూట తిండి లేని పరిస్థితి. అంతో ఇంతో తెరపిచ్చినా రహదారుల‌పై మేట‌లు వేసిన బురద, చెత్తతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇంతకుముందు వారానికి ఒకటి, రెండు సార్లు అయినా కనిపించినా సుజనా చౌదరి.. ఇప్పుడు ఈ వరదల వ‌ల్ల‌ అక్కడికి రావడమే మానేశారు. దీంతో అక్కడ ప్రజలు సుజనా చౌదరి తీరుపై విసిగిపోయినట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు వైసీపీ నాయకులు కూడా కనిపించడం లేదు. మెజార్టీ ప్రజలు మాత్రం ఎమ్మెల్యే చౌదరి ఏదేదో చేస్తారని ఆశలు పెట్టుకుని ఆయన కోసం ఎదురుచూస్తున్నారు.


అయితే ఇప్పటికే సుజనా చౌదరి - చంద్రబాబును కలిసి రూ.5 లక్షల‌ సాయం చేసి వెళ్లిపోయారు. తర్వాత కన్పించలేదు. దీంతో ఇప్పుడు మా ఎమ్మెల్యే ఎక్కడ.. అన్న ప్లెక్సీలు కనపడుతున్నాయి. దీని వెనక విజయవాడ.. పశ్చిమ నియోజకవర్గం లో మంచిపట్టున్న తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ఉన్నారని.. ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు జరుగుతుందన్న ప్రచారం కూడా ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>