Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-prabhas81008114-0f87-4f98-8c43-8415973d840a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-prabhas81008114-0f87-4f98-8c43-8415973d840a-415x250-IndiaHerald.jpgరెండు తెలుగు రాష్ట్రాలకు ఆకస్మిక వరదలు తీవ్ర నష్టం కలిగించాయి.. ఎన్నడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ లో భారీ వరదలు వచ్చాయి.. భారీ వర్షాలు ఒక కారణం అయితే ఆ వర్షానికి బుడమేరు వాగుకు గండ్లు పడి భారీ వరదకు కారణం అయింది.. దీనితో విజయవాడ నగరం మునిగిపోయింది.విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది.. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. వరద భాధితులకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం చేసింది.. #prabhas{#}West Godavari;Coronavirus;Viswak sen;king;krishnam raju;Venkatesh;Prabhas;Vijayawada;Andhra Pradesh;Telugu;Tollywood;Hero;NTR;East;Government;Telangana Chief Ministerఅప్పుడు కృష్ణంరాజు.. ఇప్పుడు ప్రభాస్ రాజు.. సాయం చేయడంలో ఇద్దరిది పెద్ద మనసే..!!అప్పుడు కృష్ణంరాజు.. ఇప్పుడు ప్రభాస్ రాజు.. సాయం చేయడంలో ఇద్దరిది పెద్ద మనసే..!!#prabhas{#}West Godavari;Coronavirus;Viswak sen;king;krishnam raju;Venkatesh;Prabhas;Vijayawada;Andhra Pradesh;Telugu;Tollywood;Hero;NTR;East;Government;Telangana Chief MinisterTue, 10 Sep 2024 07:22:35 GMT* రెండు తెలుగు రాష్ట్రాల వరద భాధితులకు ప్రభాస్ భారీ విరాళం..

* సాయం చేయడంలో పెదనాన్న కృష్ణం రాజు బాటలో  ప్రభాస్ రాజు…
 
* కష్టం వచ్చిన ప్రతీసారి ప్రభాస్ ఆర్ధిక సాయం.. నిజమైన హీరో అంటూ ప్రశంసలు..


రెండు తెలుగు రాష్ట్రాలకు ఆకస్మిక వరదలు తీవ్ర నష్టం కలిగించాయి.. ఎన్నడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ లో భారీ వరదలు వచ్చాయి.. భారీ వర్షాలు ఒక కారణం అయితే ఆ వర్షానికి బుడమేరు వాగుకు గండ్లు పడి భారీ వరదకు కారణం అయింది.. దీనితో విజయవాడ నగరం మునిగిపోయింది.విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది.. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. వరద భాధితులకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం చేసింది.. వరద భాధితులకు ఆహరం, పాలు బిస్కెట్ లు వంటివి డ్రోన్స్ ద్వారా వెళ్లలేని చోటుకి సైతం అందేలా చేసారు.. అంతే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు బోట్ ద్వారా వరద ప్రాంతాలను పర్యటించి భాధితులకు దైర్యం చెప్పారు..ఇదిలా ఉంటే వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన భాదితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ముందుకొచ్చింది.. అందరి కంటే ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేసారు.. ఎన్టీఆర్ ను చూసి టాలీవుడ్ అంతా కదిలి వచ్చింది.

స్టార్ హీరోలు అల్లు అర్జున్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ యంగ్ హీరోలు సిద్దూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వంటి వారు ఆర్ధిక సాయం అందించారు.. అందరి కంటే ఎక్కువగా రెబల్ స్టార్ ప్రభాస్ రెండు తెలుగు రాష్ట్రాలకు 2 కోట్లు ప్రకటించాడు..ఇప్పుడే కాదు.. ఆపద వచ్చిన ప్రతీసారి నేనున్నాను అంటూ ముందుకు వచ్చి ప్రభాస్ భారీ సాయం ప్రకటించేస్తుంటాడు. కరోనా సమయంలో లాక్‌డౌన్ కారణంగా జనాల బతుకులు స్తంభించి పోయినపుడు ప్రభాస్‌ ఏకంగా 4కోట్ల విరాళం ప్రకటించి దాన కర్ణుడిలా నిలిచారు. అంతే కాదు వయనాడ్‌లో వరదలు విలయం సృష్టించినప్పుడు..కూడా మనవాళ్లు కాదు కదా అని  ఆయన అనుకోలేదు. వయనాడ్‌ కోసం 2కోట్ల రూపాయలు సాయం చేసి ప్రభాస్ నిజమైన రాజు అనిపించుకున్నాడు... ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు రెండు కోట్లు ఇచ్చాడు…అయితే సాయం చేయడంలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుది కూడా పెద్దమనసే.. 1986 లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరదలు వచ్చినప్పుడు కృష్ణం రాజు అందరికంటే ఎక్కువగా రూ. 1.05 లక్షలు సాయం చేసారు.. సాయంలో అప్పుడు కృష్ణం రాజు.. ఇప్పుడు ప్రభాస్ రాజు ఇద్దరిది పెద్దమనసే అని అంతా కామెంట్స్ చేస్తున్నారు..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>