MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya6579ef0f-1d87-415b-aaee-5e806df4c309-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya6579ef0f-1d87-415b-aaee-5e806df4c309-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ తన కెరీర్లో సింహ అనే టైటిల్ తో వచ్చే అనేక సినిమాలలో హీరోగా నటించాడు. అందులో అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. మరి ఇప్పటివరకు బాలకృష్ణ నటించిన ఏ సినిమా టైటిల్స్ లో సింహ అని వచ్చింది అనే వివరాలను తెలుసుకుందాం. బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి సింహం నవ్వింది అనే సినిమాలో నటించాడు. ఈ మూవీ 1987 వ సంవత్సరంలో విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. బాలకృష్ణ 1994 వ సంవత్సరం బొబ్బిలి సింహం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో Balayya{#}b gopal;sanghavi;simhaa;Roja;Rayalaseema;Samarasimha Reddy;Narasimha Naidu;Simha;Bobbili;meena;anjali;Simran Bagga;lion;Box office;Balakrishna;Cinema;Fatherబాలకృష్ణ కు కలిసి వచ్చిన సింహ టైటిల్.. ఎన్ని సినిమాల్లో ఉందో తెలుసా..?బాలకృష్ణ కు కలిసి వచ్చిన సింహ టైటిల్.. ఎన్ని సినిమాల్లో ఉందో తెలుసా..?Balayya{#}b gopal;sanghavi;simhaa;Roja;Rayalaseema;Samarasimha Reddy;Narasimha Naidu;Simha;Bobbili;meena;anjali;Simran Bagga;lion;Box office;Balakrishna;Cinema;FatherTue, 10 Sep 2024 13:32:00 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ తన కెరీర్లో సింహ అనే టైటిల్ తో వచ్చే అనేక సినిమాలలో హీరోగా నటించాడు. అందులో అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. మరి ఇప్పటివరకు బాలకృష్ణ నటించిన ఏ సినిమా టైటిల్స్ లో సింహ అని వచ్చింది అనే వివరాలను తెలుసుకుందాం.

బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి సింహం నవ్వింది అనే సినిమాలో నటించాడు. ఈ మూవీ 1987 వ సంవత్సరంలో విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

బాలకృష్ణ 1994 వ సంవత్సరం బొబ్బిలి సింహం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో మీనా , రోజా హీరోయిన్లుగా నటించగా ... కోదండరామిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

బాలకృష్ణ 1999 వ సంవత్సరంలో సమరసింహా రెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సిమ్రాన్ , సంఘవి , అంజలి జావేరి హీరోయిన్లుగా నటించగా ... బి గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.

బాలకృష్ణ 2001 వ సంవత్సరం నరసింహ నాయుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

బాలకృష్ణ 2002 వ సంవత్సరం సీమ సింహం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

2004 వ సంవత్సరం బాలకృష్ణ లక్ష్మీనరసింహ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

2010 లో బాలకృష్ణ సింహ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

2018 వ సంవత్సరం బాలకృష్ణ జై సింహ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

2023 వ సంవత్సరం బాలకృష్ణ వీర సింహా రెడ్డి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>