Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialostars-lifestyleed1cee33-e309-47e5-8f76-dce4f055fd59-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialostars-lifestyleed1cee33-e309-47e5-8f76-dce4f055fd59-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఈరోజు గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో, పాన్ ఇండియా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి ఎన్టీఆర్ సొంతం. ఇండియా నుంచి జపాన్ వరకూ ఎన్టీఆర్ ఇమేజ్ స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇదంతా ఈరోజు, దశ్బ్దం క్రితం ఇలా లేదు. సరిగ్గా చెప్పాలి అంటే ఎనిమిదేళ్ళ క్రితం ఎన్టీఆర్ పరిస్థితి వేరు. ఎన్టీఆర్ అభిమాని అని చెప్పుకోవడానికి కూడా ఫాన్స్ ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. 19 ఏళ్లకే స్టార్ హీరో అయిన ఎన్టీఆర్, ఆ తర్వాత 2010లో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ కొట్టాడు. ఈ తర్వాత మూడున్నర ఏళ్ల పాట్టు ఎన్టీఆర్ కి హిట్ అనsocialostars lifestyle{#}Badshah;mani sharma;prashanth neel;vakkantham vamsi;Japan;Prasanth Neel;Temper;Gift;war;NTR;Chitram;puri jagannadh;Heroine;Hero;Director;Cinema;Indiaరిస్క్ అని తెలిసినా ఆ సినిమా చేసేందుకు ఒప్పుకున్న ఎన్టీఆర్..!!రిస్క్ అని తెలిసినా ఆ సినిమా చేసేందుకు ఒప్పుకున్న ఎన్టీఆర్..!!socialostars lifestyle{#}Badshah;mani sharma;prashanth neel;vakkantham vamsi;Japan;Prasanth Neel;Temper;Gift;war;NTR;Chitram;puri jagannadh;Heroine;Hero;Director;Cinema;IndiaSun, 08 Sep 2024 16:30:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఈరోజు గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో, పాన్ ఇండియా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి ఎన్టీఆర్ సొంతం. ఇండియా నుంచి జపాన్ వరకూ ఎన్టీఆర్ ఇమేజ్ స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇదంతా ఈరోజు, దశ్బ్దం క్రితం ఇలా లేదు. సరిగ్గా చెప్పాలి అంటే ఎనిమిదేళ్ళ క్రితం ఎన్టీఆర్ పరిస్థితి వేరు. ఎన్టీఆర్ అభిమాని అని చెప్పుకోవడానికి కూడా ఫాన్స్ ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. 19 ఏళ్లకే స్టార్ హీరో అయిన ఎన్టీఆర్, ఆ తర్వాత 2010లో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ కొట్టాడు. ఈ తర్వాత మూడున్నర ఏళ్ల పాట్టు ఎన్టీఆర్ కి హిట్ అనే మాటే లేదు. ఏ మూవీ చేసినా, ఏ డైరెక్టర్ తో వర్క్ చేసినా అది బాక్సాఫీస్ దగ్గర డిజప్పాయింట్ చేస్తూనే ఉంది. ఎన్టీఆర్ ఈ సినిమాతో అయినా హిట్ ఇస్తాడా అని ఎదురు చూడని అభిమాని లేడు. ఒక్క హిట్ కొట్టు అన్నా అని కోరుకోని అభిమాని లేడు అంటే అతిశయోక్తి లేదు. ఎంతో ఆశగా థియేటర్స్ కి వెళ్లి ఎన్టీఆర్ అభిమానులు నీరసంగా తల ఒంచుకోని బయటకి వచ్చిన రోజులు అవి. రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా ట్రోల్ చేస్తున్న వారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా మాటలు లేకుండా చేస్తున్నాయి. ఆఖరికి ఎన్టీఆర్ యాక్టింగ్ లో కూడా మొనాటమి వచ్చేసింది అనే కామెంట్స్ కూడా వినిపించేసాయి. అంతేనా? ఎన్టీఆర్ పని అయిపోయిందా? ఇక హిట్ అనే మాట ఎన్టీఆర్ కెరీర్ లో వినిపించదా? ఎన్టీఆర్ అభిమానులు మిగిలిన హీరోల అభిమానుల ముందు తల ఒంచుకోని ఉండాల్సిందేనా? తమ హీరోని వాళ్లు కామెంట్స్ చేస్తుంటే సైలెంట్ గా ఉండాల్సిందేనా? అసలు ఎన్టీఆర్ హిట్ ఎప్పుడు కొడతాడు? కంబ్యాక్ ఎప్పుడు ఇస్తాడు? ఈ ప్రశ్నలకి సమాధానం దొరికింది… 2015లో ఎన్టీఆర్-పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేశాడు. టెంపర్ అనే టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీకి అనుప్ మ్యూజిక్ డైరెక్టర్, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, హీరోయిన్ కాజల్ అగర్వాల్. హీరో ఫ్లాప్స్ లో ఉన్నాడు, డైరెక్టర్ ఫ్లాప్స్ లో ఉన్నాడు, మణిశర్మ ఫామ్ లో లేడు.

 ఎన్టీఆర్ ఖాతాలో మరో ఫ్లాప్ పడుతుందా? ఎన్టీఆర్ ఫాన్స్ కి మరోసారి డిజప్పాయింట్మెంట్ తప్పదా? అసలు ఎన్టీఆర్ కి ఏం అయ్యింది ఫ్లాప్స్ ఉన్న డైరెక్టర్ కి సినిమా ఇచ్చాడు. లో ఫేజ్ లో ఉన్నప్పుడు హిట్ స్ట్రీక్ లో ఉన్న డైరెక్టర్ తో సినిమా చెయ్యొచ్చు కదా అనే మాటలు మొదలయ్యాయి. ఈ కామెంట్స్ ని పట్టించుకోకుండానే టెంపర్ సినిమా షూటింగ్ ని చేసేస్తున్నాడు పూరి జగన్నాథ్.ఇదిలావుంటే టెంపర్ విషయంలో వక్కంతం వంశీ స్వయంగా ఎన్టీఆర్ నే ప్రశ్నించారు. బాద్షా తర్వాత ఎన్టీఆర్ కి రామయ్య వస్తావయ్యా, రభస రూపంలో రెండు డిజాస్టర్లు గురయ్యాయి. ఆ టైంలో ఎంచుకున్న కథ టెంపర్. తేడా కొడితే హ్యాట్రిక్ ఫ్లాపులు పడతాయి. రిస్క్ అనిపించలేదా అని వక్కంతం వంశీ అడిగారు.దీనికి ఎన్టీఆర్ ఎమోషనల్ గా సమాధానం ఇచ్చాడు. ఈ కథ విన్నప్పుడు నాకు గ్రే షేడ్, పాజిటివ్ షేడ్ కనిపించలేదు. ఒక మనిషి ప్రయాణం మాత్రమే కనిపించింది. మంచి వాడు చెడ్డవాడిగా మారితే చెడ్డవాడిగానే చనిపోతాడు. చెడ్డవాడు మంచివాడిగా మారితే దేవుడిగా మిగిలిపోతాడు అనేది ఈ చిత్రం కథాంశం. నేను నమ్మేది కూడా అదే అని ఎన్టీఆర్ అన్నారు.నేను చనిపోతే నా ఫ్యామిలీ కాకుండా బయట వాళ్ళు కూడా ఎంతోకొంత మంది బాధపడాలి. ఒక మనిషిగా నేను సాధించుకోగలిగేది అదే అని ఎన్టీఆర్ తెలిపారు. నేను నమ్మే సిద్ధాంతంతానికి దగ్గరగా ఉండే చిత్రం టెంపర్ అని ఎన్టీఆర్ తెలిపారు.ప్రస్తుతంఎన్టీఆర్ తిరుగులేని నటుడిగా పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నాడు. దేవర, వార్ 2 లాంటి పాన్ ఇండియా చిత్రాలతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని చిత్రం కూడా ప్రారంభం అయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>