MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/multiplexes-08d3bbbe-4b93-4839-8986-8340f85229ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/multiplexes-08d3bbbe-4b93-4839-8986-8340f85229ee-415x250-IndiaHerald.jpgఒకప్పుడు సినిమాలు చూడాలంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లకే వెళ్లేవాళ్లు. ఇవే మన తెలుగు సినిమాకి వెన్నెముకలా నిలిచాయి. అయితే కానీ, మల్టీప్లెక్స్ థియేటర్లు ఎక్కువయ్యే కొద్దీ, సింగిల్ స్క్రీన్ థియేటర్లకి వచ్చే ప్రేక్షకులు తగ్గిపోయారు. అందుకే బిజినెస్ బాగా జరగక యజమానులు చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు శాశ్వతంగా క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు దేశంలో మల్టీప్లెక్స్ థియేటర్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల కంటే ఎక్కువగా ఉండబోతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు అంటే ఒకే హాలులో ఒకే సినిమా మాత్రమే ప్రదర్శించే చిన్నMultiplexes {#}Ishtam;local language;Telugu;Audience;Tollywood;Cinemaమల్టీప్లెక్స్‌లే టాలీవుడ్ ఇండస్ట్రీకి శాపం..?మల్టీప్లెక్స్‌లే టాలీవుడ్ ఇండస్ట్రీకి శాపం..?Multiplexes {#}Ishtam;local language;Telugu;Audience;Tollywood;CinemaSun, 08 Sep 2024 13:40:00 GMTఒకప్పుడు సినిమాలు చూడాలంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లకే వెళ్లేవాళ్లు. ఇవే మన తెలుగు సినిమాకి వెన్నెముకలా నిలిచాయి. అయితే కానీ, మల్టీప్లెక్స్ థియేటర్లు ఎక్కువయ్యే కొద్దీ, సింగిల్ స్క్రీన్ థియేటర్లకి వచ్చే ప్రేక్షకులు తగ్గిపోయారు. అందుకే బిజినెస్ బాగా జరగక యజమానులు చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు శాశ్వతంగా క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు దేశంలో మల్టీప్లెక్స్ థియేటర్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల కంటే ఎక్కువగా ఉండబోతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు అంటే ఒకే హాలులో ఒకే సినిమా మాత్రమే ప్రదర్శించే చిన్న థియేటర్లు.

2009 సంవత్సరంలో మన దేశంలో 9,710 సింగిల్ స్క్రీన్ థియేటర్లు, 925 మల్టీప్లెక్స్ థియేటర్లు ఉండేవి. అప్పటి నుండి ప్రతి ఏడాది మల్టీప్లెక్స్‌లు ఎక్కువవుతూ వస్తున్నాయి, కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్లు తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు మన దేశంలో మొత్తం 9,208 స్క్రీన్లు ఉన్నాయి. వీటిలో 4,745 సింగిల్ స్క్రీన్లు, 4,463 మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. అంటే, ఈ ఏడాది చివరికే మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల కంటే ఎక్కువ అయిపోయే అవకాశం ఉంది.

గత 14 సంవత్సరాలలో దాదాపు 5,000 సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతబడ్డాయి. ఈ ఏడాది మాత్రమే 660 థియేటర్లు మూతబడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది సింగిల్ స్క్రీన్ థియేటర్ల సంఖ్య ఎంత తగ్గుతోందో చూపిస్తుంది. మన దేశంలో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 66% అంటే మూడింట రెండు వంతులు దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. అందులోనూ తెలుగు రాష్ట్రాలలోనే అత్యధికంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. కానీ వీటి సంఖ్య తగ్గుతుందనే మాట మాత్రం వాస్తవం.

పెద్ద పట్టణాల్లో మాత్రమే మల్టీప్లెక్స్‌లు పుట్టుకొస్తున్నాయి. చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లో నివసించే వారికి ఈ థియేటర్లోకి వెళ్లి సినిమా చూడటం కష్టం కావచ్చు. ప్రతి చోటా మల్టీప్లెక్స్‌లు ఉండవు కాబట్టి, చాలామందికి సినిమాలు చూసే అవకాశం తగ్గుతుంది. దీనివల్ల టికెట్లు కొనేవారు ఉండరు ఫలితంగా సినిమా ఇండస్ట్రీకి నష్టం వాటిల్లుతుంది.

మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్ ధరలు సింగిల్ స్క్రీన్ థియేటర్ల కంటే ఎక్కువగా ఉంటాయి. అంటే, పేద వాళ్ళు సినిమాలు చూడాలంటే చాలా ఖర్చు అవుతుంది. అందుకే వీటికి వెళ్లడానికి ఫ్యామిలీలు ధైర్యం చేయకపోవచ్చు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో చాలా మంది స్థానిక ప్రజలు కలిసి సినిమాలు చూసేవారు. అలాంటి అనుభవం మల్టీప్లెక్స్‌లలో ఉండదు. అందుకే చాలా మందికి పాత థియేటర్లు మూతబడడం ఇష్టం ఉండదు. మల్టీప్లెక్స్‌లలో ఎక్కువగా పెద్ద బడ్జెట్ సినిమాలే ప్రదర్శితమవుతాయి. చిన్న బడ్జెట్ సినిమాలు లేదా రీజనల్ సినిమాలకు చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఇది కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి మైనస్ అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>