PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lavusrikrishnadevarayalu6a46f033-fb23-48b0-9400-7cc1fede26b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lavusrikrishnadevarayalu6a46f033-fb23-48b0-9400-7cc1fede26b6-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ యువ రాజకీయనేతల్లో లావు శ్రీకృష్ణదేవరాయలుకంటూ ఒక ప్రత్యేకత ఉంది.ఆయన నరసరావుపేట పార్లమెంట్ ఎంపీగా రెండోసారి గెలిచి అప్పటిదాకా ఆ పార్లమెంట్ స్థానానికి ఉన్న రికార్డ్ ను బ్రేక్ చేశారు.ఆయన మొదటి సారి గెలిచి పార్లమెంట్లోని అసెంబ్లీ స్థానాలకు చేసిన సేవలే ఆయన్ను ప్రజలకు దగ్గర చేసాయి దాంతో రెండో సారి నరసరావుపేట పార్లమెంట్ ప్రజలు పట్టం కట్టారు.ఆయన రాజకీయాలపై ఆసక్తితో 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఆయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రlavusrikrishnadevarayalu{#}anil music;Delhi;Lavu Sri Krishna Devarayalu;Guntur;Y. S. Rajasekhara Reddy;MP;Backward Classes;January;Loksabha;local language;narasaraopet;June;P Anil Kumar Yadav;anil kumar singhal;March;Rayapati Sambasivarao;Telugu Desam Party;Hanu Raghavapudi;Assembly;TDP;YCP;Andhra Pradesh;Parliment;Party;Jagan;Minister;Congress;రాజీనామాపార్టీ Vs ప్రజలు: పార్టీ గుర్తింపు కాదు..ప్రజల ఆశీస్సులే ముఖ్యమని నమ్మిన యువ నేత.!పార్టీ Vs ప్రజలు: పార్టీ గుర్తింపు కాదు..ప్రజల ఆశీస్సులే ముఖ్యమని నమ్మిన యువ నేత.!lavusrikrishnadevarayalu{#}anil music;Delhi;Lavu Sri Krishna Devarayalu;Guntur;Y. S. Rajasekhara Reddy;MP;Backward Classes;January;Loksabha;local language;narasaraopet;June;P Anil Kumar Yadav;anil kumar singhal;March;Rayapati Sambasivarao;Telugu Desam Party;Hanu Raghavapudi;Assembly;TDP;YCP;Andhra Pradesh;Parliment;Party;Jagan;Minister;Congress;రాజీనామాSun, 08 Sep 2024 08:54:00 GMT* పాతికేళ్ళ రికార్డ్ బ్రేక్ చేసిన ఎంపీ లావు..!

* జగన్ కు ఉన్న మొండి పట్టే లావు రికార్డ్ కు కారణం.!

* పార్టీ ఏదైనా ప్రజల ఆశీస్సులే ముఖ్యమని నిరూపించిన నేత..!

(ఏపీ-ఇండియాహెరాల్డ్): ఆంధ్రప్రదేశ్ యువ రాజకీయనేతల్లో లావు శ్రీకృష్ణదేవరాయలుకంటూ ఒక ప్రత్యేకత ఉంది.ఆయన నరసరావుపేట పార్లమెంట్ ఎంపీగా రెండోసారి గెలిచి అప్పటిదాకా ఆ పార్లమెంట్ స్థానానికి ఉన్న రికార్డ్ ను బ్రేక్ చేశారు.ఆయన మొదటి సారి గెలిచి పార్లమెంట్లోని అసెంబ్లీ స్థానాలకు చేసిన సేవలే ఆయన్ను ప్రజలకు దగ్గర చేసాయి దాంతో రెండో సారి నరసరావుపేట పార్లమెంట్ ప్రజలు పట్టం కట్టారు.ఆయన రాజకీయాలపై ఆసక్తితో 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఆయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు పై భారీ మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా పార్లమెంట్ కు ఎన్నికయ్యారు.ఎంపీగా గెలిచినా లావు గత నాలుగు సంవత్సరాలనుండి నరసరావుపేట అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు నేరుగా ఢిల్లీ పెద్దలతో పరిచయాలు పెంచుకొని నిధులు బాగా తీసుకొచ్చారు.తన పార్లమెంట్ పరిధిలోని అన్నీ నియోజకవర్గాల అభివృద్ధి చేశారు.అనేక కీలక సమస్యలకు మంచి మార్గం చూపించరాని ఆయనకు మంచి పేరుంది.

లావు శ్రీకృష్ణదేవరాయలు 2024 జనవరి 23న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఒక్కసారిగా అందరిని షాక్ కి గురి చేశారు.2024 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం నరసరావుపేట ఎంపీగా బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని డిసైడ్ అవ్వడంతో లావును గుంటూరు నుండి పోటీ చేయవలసిందిగా అధిష్టానం చెప్పడంతో లావు దానికి ఒప్పుకోలేదు అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.ఆయన 2024 మార్చి 02న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.ఆయన 2024లో నరసరావుపేట నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి అనిల్ పై ఎంపీగా గెలిచారు.శ్రీకృష్ణదేవరాయులు జూన్ 22న టీడీపీ పార్లమెంటరీ నేతగా నియమితులయ్యారు.పార్టీని చూసి కాదు వ్యక్తిత్వాన్ని చూసి గెలిపించేటటువంటి నేతల్లో ఒకరు లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన విమర్శలకు దూరంగా ఉంటూ ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా మీడియాద్వారా తప్పుగా మాట్లాడిన సందర్భాలు లేవు.నరసరావుపేట పార్లమెంట్ ప్రజలకు లావులో నచ్చిన అంశం అదేనని అంటున్నారు.

నరసరావుపేటలో పార్లమెంట్ సీట్ చరిత్రను చూస్తే ఎక్కువగా స్థానికేతరులే గెలిచిన సందర్భాలు ఉన్నాయి. స్థానిక నినాదంతో బరిలోకి దిగిన నేతలు కూడా ఓటమిపాలయ్యారు.1996 నుండి నరసరావుపేట పార్లమెంటు నుండి నేతలు సింగిల్ టైం గెలుస్తూనే వచ్చారు కానీ రెండుసార్లు వరుసగా గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. అయితే ఆనవాయితీని బ్రేక్ చేసి రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించారు లావు శ్రీకృష్ణదేవరాయులు. 1996లో టిడిపి నుంచి కోటా సైదయ్యా,1998లో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి రోశయ్య,1999 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి మేకపాటి రాజమోహన్ రెడ్డి, 2009 ఎన్నికలలో టిడిపి అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి,ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన 2014లో జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి రాయపాటి సాంబశివరావు గెలుపొందారు. అయితే 2019 ఎన్నికలలో టిడిపి అభ్యర్థిగా రాయపాటి రెండోసారి బరిలో ఉన్నప్పటికీ వైసీపీ నుండి లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీపడ్డారు. అయితే ఈ ఎన్నికలలో దాదాపు లక్షన్నర ఓట్ల మెజారిటీతో రాజకీయ ఘనాపాటి అయినటువంటి రాయపాటిని వైసీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఓడించారు.దాంతో దాదాపు రెండు దశాబ్దాల నుండి నరసరావుపేట పార్లమెంటులో ఎవ్వరు కూడా రెండుసార్లు వరుసగా గెలిచిన దాఖలు లేవు.

అలాంటిది గత ఎన్నికలలో ఈసారి టిడిపి నుంచి లావు రెండోసారి బరిలో ఉండగా వైసీపీ నుంచి స్థానికేతల మంత్రి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ని బరిలోదించారు. అయితే నరసరావుపేట పార్లమెంటు చరిత్రలో  ఉన్నటువంటి అలాంటి ఆనవాయితీని బద్దలు కొట్టే విధంగా లక్షన్నర ఓట్ల మెజారిటీతో అనిల్ కుమార్ పై భారీ విజయాన్ని దక్కించుకున్నారు. దీన్ని బట్టి తెలుస్తుంది ఏమనగా పార్టీని చూసి కాదు గెలిచిన నేత చేసిన అభివృద్ధిని బట్టి పట్టం కడతామని నరసరావుపేట పార్లమెంట్ లోని ఏడు నియోజకవర్గాల ప్రజలు తమ ఓటు రూపంలోచెప్పారు.దాంతో వైసీపీని వీడి టీడీపీలో అడుగు పెట్టినందుకు ఆయనకు మంచే జరిగిందని చెప్పాలి. 2024 ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేకతతో ఉన్న ప్రజల్లో లావుకు కూడా ఏంతోకంత ప్రభావం చూపించి ఉండేది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>