MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pallu-ralagodutha-antu-balayya-mass-worning-evarikanteb3c65ac3-8dfd-4552-bb87-266481849f6a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pallu-ralagodutha-antu-balayya-mass-worning-evarikanteb3c65ac3-8dfd-4552-bb87-266481849f6a-415x250-IndiaHerald.jpgనందమూరి బాలయ్య ఏ మాట మాట్లాడినా కూడా అభిమానులకు ఇష్టమే..ఆయన కోపంతో కొట్టినా అభిమానులు మాత్రం ఆనందంగానే తీసుకుంటారు. ఎందుకంటే ఈ వంకతోనైనా మా అభిమాన హీరో మమ్మల్ని తాకాడు అనుకుంటారు తప్ప దాని తప్పుగా అర్థం చేసుకోరు. బాలకృష్ణ కోపిష్టి అనే సంగతి చాలామందికి తెలుసు. ఇక ఆయనకి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. అందుకే ఆయన కోపంతో అభిమానులు నెట్టేసినా కూడా వాళ్ళు దాన్ని ప్రేమగానే చూస్తారు తప్ప ఏంటి ఇలా ఉన్నారు అంటూ విమర్శలు చేయరు. అయితే అలాంటి స్టార్ హీరో బాలకృష్ణ ఈ మధ్యనే 50 ఏళ్ల సినీ వేడుకను ఘనంగా జరుపNANDAMURI BALAKRISHNA; ADITHYA 369; BHAIRAVA DWEEPAM; TOLLYWOOD{#}prema;twitter;Balakrishna;Hero;Success;Love;Event;Teluguఒళ్ళు దగ్గర పెట్టుకో లేదంటే పళ్ళు రాలగొడతా అంటూ బాలయ్య మాస్ వార్నింగ్.. ఎవరికంటే..?ఒళ్ళు దగ్గర పెట్టుకో లేదంటే పళ్ళు రాలగొడతా అంటూ బాలయ్య మాస్ వార్నింగ్.. ఎవరికంటే..?NANDAMURI BALAKRISHNA; ADITHYA 369; BHAIRAVA DWEEPAM; TOLLYWOOD{#}prema;twitter;Balakrishna;Hero;Success;Love;Event;TeluguSun, 08 Sep 2024 11:55:00 GMTనందమూరి బాలయ్య ఏ మాట మాట్లాడినా కూడా అభిమానులకు ఇష్టమే..ఆయన కోపంతో కొట్టినా అభిమానులు మాత్రం ఆనందంగానే తీసుకుంటారు. ఎందుకంటే ఈ వంకతోనైనా మా అభిమాన హీరో మమ్మల్ని తాకాడు అనుకుంటారు తప్ప దాని తప్పుగా అర్థం చేసుకోరు. బాలకృష్ణ కోపిష్టి అనే సంగతి చాలామందికి తెలుసు. ఇక ఆయనకి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. అందుకే ఆయన కోపంతో అభిమానులు నెట్టేసినా కూడా వాళ్ళు దాన్ని ప్రేమగానే చూస్తారు తప్ప  ఏంటి ఇలా ఉన్నారు అంటూ విమర్శలు చేయరు. అయితే అలాంటి స్టార్ హీరో బాలకృష్ణ ఈ మధ్యనే 50 ఏళ్ల సినీ వేడుకను ఘనంగా జరుపుకున్నారు.ఈయన ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తవడంతో ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు కలిసి ఈయనకి ఘనంగా సన్మానం చేశారు.

ఇక ఈ ఈవెంట్ కి ఎంతోమంది అతిరథ మహారధులు వచ్చి దీన్ని సక్సెస్ చేసారు.అయితే తాజాగా బాలకృష్ణ మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇక బాలకృష్ణ ఎప్పుడు ఏదో ఓ సందర్భంలో మాట్లాడిన వీడియోలు అప్పుడప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. అలా తాజాగా ట్విట్టర్ లో బాలకృష్ణ మాట్లాడిన వీడియో  వైరలవుతోంది.ఇక ఈ వీడియోలో ఏముందంటే.. ఇంకోసారి తెలుగు ఇండస్ట్రీలో దర్శకులు లేరు.. అంటే వాళ్ళ పళ్ళు రాలగొడతా.. మన తెలుగులో దర్శకులు లేరా..సాంకేతిక నిపుణులు లేరా.. నిర్మాతలు లేరా హీరోలు లేరా.. మన తెలుగు ఇండస్ట్రీని ఎందుకు తక్కువ చేయాలి.

నేను చేసిన భైరవద్వీపం,ఆదిత్య 369 వంటి సినిమాలు ఎంత అద్భుతంగా వచ్చాయో తెలియదా..ఆ సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేశాయి.. ఇంకొకసారి ఎవరైనా మన తెలుగులో అలాంటి దర్శకులు లేకపోవడం దురదృష్టకరం.. ఇలాంటి దర్శకులు లేకపోవడం దురదృష్టకరం అని నా ముందు అంటే మాత్రం అస్సలు సహించేది లేదు. ఈ మాటలు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అంటూ బాలయ్య మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో జై బాలయ్య అంటూ ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>