Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vinayaka829c7135-1c0a-47df-a7fe-453fc4d9f631-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vinayaka829c7135-1c0a-47df-a7fe-453fc4d9f631-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరు కూడా వినాయకుడి పూజా కార్యక్రమాలలో మునిగిపోయారు. ఊరువాడ అనే తేడా లేకుండా ప్రతి చోట కూడా పండగ శుభ సంతరించుకుంటుంది. సాధారణంగా పండగ వస్తే కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే హడావిడి ఉంటుంది. కానీ వినాయక చవితి వచ్చిందంటే చాలు ఏకంగా తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ వినాయకుడి పూజలలో నిమజ్జనం అవుతూ ఉత్సవాలను జరుపుకుంటూ ఉంటారూ అన్న విషయం తెలిసిందే. అయితే ఎక్కడ చూసినా సర్వాvinayaka{#}Pooja Hegde;Rakshasuduగణపయ్య పూజలో.. 'గరిక' కు ఎందుకంత ప్రాధాన్యం ఉంటుందో తెలుసా?గణపయ్య పూజలో.. 'గరిక' కు ఎందుకంత ప్రాధాన్యం ఉంటుందో తెలుసా?vinayaka{#}Pooja Hegde;RakshasuduSun, 08 Sep 2024 09:22:00 GMTప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరు కూడా వినాయకుడి పూజా కార్యక్రమాలలో మునిగిపోయారు. ఊరువాడ అనే తేడా లేకుండా ప్రతి చోట కూడా పండగ శుభ సంతరించుకుంటుంది. సాధారణంగా పండగ వస్తే కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే హడావిడి ఉంటుంది. కానీ వినాయక చవితి వచ్చిందంటే చాలు ఏకంగా తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ వినాయకుడి పూజలలో నిమజ్జనం అవుతూ ఉత్సవాలను జరుపుకుంటూ ఉంటారూ అన్న విషయం తెలిసిందే.


 అయితే ఎక్కడ చూసినా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయబడిన మందిరాలు.. ఇక ఆ మందిరాలలో కొలువుతీరిన గణనాథుడు కనిపిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఎంతో నిష్టగా పూజలు చేస్తూ గణనాథున్ని పూజిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే గణేశుడి పూజ ఎప్పుడు జరిగినా కూడా ఇక గరిక ఆ పూజా కార్యక్రమంలో ఉండాల్సిందే. గరిక లేకుండా వినాయకుడి పూజ జరిగిన ఇప్పటివరకు దాదాపు ఎక్కడ జరగలేదు. అయితే ఇలా వినాయకుడి పూజలో ఎందుకు గరికకు ఇంత ప్రాధాన్యం ఉన్నది అన్న విషయం మాత్రం చాలామందికి  తెలియదు.


 కాగా వినాయక చవితి పూజల్లో ఎన్ని రకాల పుష్పాలు వాడినప్పటికీ పత్రిలో గరిక లేకపోతే మాత్రం వినాయకుడు లోటుగా భావిస్తాడని పూజారులు కూడా చెబుతూ ఉంటారు  అయితే పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడి పుట్టించి దేవతలను ఇబ్బందులకు గురి చేశాడట  అయితే ఆ రాక్షసుడిని గణేశుడు మింగేయడంతో ఆయన శరీరం కూడా వేడిగా మారిపోయిందట. దీంతో ఋషుల సూచనతో 21 గరిక పోచలను స్వామి తలపై పెట్టుకోగా.  వినాయకుడి శరీరం మొత్తం ఒక్కసారిగా చల్లబడి పోయిందట  అప్పటినుంచి ఇక వినాయకుడి పూజ జరిగిన ప్రతి చోట గరికను ఆ పూజలో భాగం చేయడం చేస్తూ ఉంటారు పూజారులు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>