PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/raghurama-krishnamraju03cd5ef6-0603-4418-ac2c-0b79f3860364-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/raghurama-krishnamraju03cd5ef6-0603-4418-ac2c-0b79f3860364-415x250-IndiaHerald.jpgరెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి నామమాత్రపు అవగాహన ఉన్నవాళ్లకు సైతం రఘురామ కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. పారిశ్రామికవేత్తగా, రాజకీయనేతగా తనదైన ముద్ర వేసిన రఘురామ కృష్ణంరాజు 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. అయితే వైసీపీ నుంచి ఎంపీగా విజయం సాధించినా చాలా సందర్భాల్లో రఘురామ వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. raghurama krishnamraju{#}Jagan;Kanumuru Raghu Rama Krishnam Raju;రాజీనామా;media;CM;February;TDP;YCP;Minister;Teluguఏ పార్టీలో ఉన్నా రఘురామ హీరోనే.. ఇలా ఉండటం ఏ నేతకు సాధ్యం కాదేమా?ఏ పార్టీలో ఉన్నా రఘురామ హీరోనే.. ఇలా ఉండటం ఏ నేతకు సాధ్యం కాదేమా?raghurama krishnamraju{#}Jagan;Kanumuru Raghu Rama Krishnam Raju;రాజీనామా;media;CM;February;TDP;YCP;Minister;TeluguSun, 08 Sep 2024 07:36:00 GMTరెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి నామమాత్రపు అవగాహన ఉన్నవాళ్లకు సైతం రఘురామ కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. పారిశ్రామికవేత్తగా, రాజకీయనేతగా తనదైన ముద్ర వేసిన రఘురామ కృష్ణంరాజు 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. అయితే వైసీపీ నుంచి ఎంపీగా విజయం సాధించినా చాలా సందర్భాల్లో రఘురామ వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.
 
జగన్ బొమ్మతో తాను గెలవలేదంటూ రఘురామ కృష్ణంరాజు కామెంట్లు చేసి గతంలో హాట్ టాపిక్ అయ్యారు. మాజీ సీఎం జగన్ కు కంటిలో నలుసులా రఘురామ తెగ ఇబ్బంది పెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెల 24వ తేదీన రఘురామ పదవికి రాజీనామా చేయడం జరిగింది. అయితే అటు వైసీపీలో ఉన్నా ఇటు టీడీపీలో ఉన్నా రఘురామ కృష్ణంరాజు హీరోనే అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
రఘురామ కృష్ణంరాజులా ఉండటం మరే నేతకు సాధ్యం కాదేమో అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఉండి నియోజకవర్గం నుంచి రఘురామ కృష్ణంరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ నేతలకు సైతం పలు సందర్భాల్లో షాకిచ్చే విధంగా రఘురామ కృష్ణంరాజు వ్యవహరించడం గమనార్హం. రఘురామ వైసీపీకి షాకిచ్చిన రేంజ్ లో మాత్రం టీడీపీకి షాక్ ఇవ్వడం లేదనే సంగతి తెలిసిందే.
 
రఘురామ కృష్ణంరాజుకు మంత్రి పదవి దక్కి ఉంటే బాగుండేదని కొంతమంది కామెంట్లు చేస్తుండగా రాబోయే రోజుల్లో రఘురామ కృష్ణంరాజుకు మంత్రి పదవి దక్కుతుందేమో చూడాల్సి ఉంది. రఘురామ కృష్ణంరాజు పార్టీ ఏదైనా తన మనస్సులో ఉండే అభిప్రాయాలను పంచుకునే విషయంలో ముందువరసలో ఉంటారని చెప్పవచ్చు. రఘురామ కృష్ణంరాజు ఇతర నేతలకు భిన్నమైన నేత అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.  రఘురామ అసెంబ్లీలో జగన్ ను కలవడం కూడా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>