PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-anant-ambani-c1618a23-0f44-457d-b2ad-5a0c15162ba6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-anant-ambani-c1618a23-0f44-457d-b2ad-5a0c15162ba6-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి వీధి వీధికీ వినాయక ప్రతిమను ప్రతిష్టించి, నిమజ్జనం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహిస్తుంటారు. దీని కోసం ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగ్గట్టు చందాలు ఇస్తుంటారు. అయితే దేశంలో కొన్ని చోట్ల జరిగే వినాయక చవితి వేడుకలు అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. అలాంటిదే లాల్ బాగ్ ప్రాంతంలోని లాల్‌బాగ్చా ఆలయం. అక్కడికి తరచూ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ వస్తుంటారు. తరచూ వినాయకుని దర్శించుకుంటుంటారు. అయితే ఆ ఆలయాన్ని ప్రస్తుతం ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన భAnant Ambani {#}Mukesh;Shiva;raja;Reliance;lord siva;Prize;Gift;Ganesh Chaturthi;Wife;gold;Fatherవినాయకుడికి అనంత్ అంబానీ-రాధిక దంపతులు ఖరీదైన బహుమతి.. దాని ధర తెలిస్తే షాక్ అవుతారు!వినాయకుడికి అనంత్ అంబానీ-రాధిక దంపతులు ఖరీదైన బహుమతి.. దాని ధర తెలిస్తే షాక్ అవుతారు!Anant Ambani {#}Mukesh;Shiva;raja;Reliance;lord siva;Prize;Gift;Ganesh Chaturthi;Wife;gold;FatherSun, 08 Sep 2024 12:30:00 GMTదేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి వీధి వీధికీ వినాయక ప్రతిమను ప్రతిష్టించి, నిమజ్జనం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహిస్తుంటారు. దీని కోసం ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగ్గట్టు చందాలు ఇస్తుంటారు. అయితే దేశంలో కొన్ని చోట్ల జరిగే వినాయక చవితి వేడుకలు అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. అలాంటిదే లాల్ బాగ్ ప్రాంతంలోని లాల్‌బాగ్చా ఆలయం. అక్కడికి తరచూ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ వస్తుంటారు. తరచూ వినాయకుని దర్శించుకుంటుంటారు. అయితే ఆ ఆలయాన్ని ప్రస్తుతం ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన భార్య రాధికతో కలిసి దర్శించుకున్నారు. ఈ క్రమంలో గణనాథునికి ఆయన విలువైన బహుమతి అందజేశారు. అది చూసిన వారంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. దాని విలువ తెలుసుకుని నోరెళ్లబెడుతున్నారు. వారి స్థాయికి తగ్గట్టే ఎంతో విలువైన బహుమతి అందివ్వడంతో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ముంబైలో గణేష్ చతుర్థి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ ప్రత్యేక సందర్భంలో, ముంబైలో లాల్‌బాగ్చా రాజా యొక్క గొప్ప ప్రతిష్ఠాపనను నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఆయన విగ్రహం దర్శనం ప్రజలకు తెరిచి ఉంది. లాల్‌బాగ్చా రాజా దర్శనం కోసం భక్తులు సుదూర ప్రాంతాల నుండి వస్తుంటారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ముంబైలోని లాల్ బాగ్ ప్రాంతంలోని లాల్‌బాగ్చా రాజా విగ్రహానికి బంగారు కిరీటాన్ని విరాళంగా ఇచ్చారు.

గణపతి బప్పా మోర్యాల హర్షధ్వానాల మధ్య లాల్‌బాగ్చా రాజా విగ్రహావిష్కరణ అనంతరం ఈ కిరీటాన్ని గణనాథునికి సమర్పించారు. ఈ కిరీటం బరువు 20 కిలోలు, దీని ధర వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ కిరీటం ధర దాదాపు రూ.15 కోట్లు ఉంటుందని అంచనా. అంబానీ కుటుంబం చాలా సంవత్సరాలుగా 'లాల్‌బాగ్ చా రాజా' ఆలయంతో అనుబంధం కలిగి ఉన్నారు. ప్రపంచ స్థాయి వ్యాపార కుటుంబమే కాకుండా ఆధ్యాత్మిక, సనాతన ధర్మాన్ని తమ కుటుంబం నమ్ముతుందని అనంత్ అంబానీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అనంత్ మాట్లాడుతూ, 'నా సోదరుడు గొప్ప శివ భక్తుడు. మా నాన్న వినాయకుడిని పూజిస్తారు. నవరాత్రులలో అమ్మ తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటుంది. మా అమ్మమ్మ కూడా శ్రీనాథ్ జీ భక్తురాలు. నా కుటుంబంలో అందరూ భగవంతుని భక్తులే. మన దగ్గర ఉన్నదంతా ఆయనే ఇస్తారు. దేవుడు మీలో, నాలో అన్ని చోట్లా ఉన్నాడని మేము నమ్ముతున్నాము. నా కుటుంబం మొత్తం సనాతన ధర్మాన్ని నమ్ముతుంది' అని పేర్కొన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>