MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0bac4f89-fa24-47c6-a024-edc2b99ca50f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0bac4f89-fa24-47c6-a024-edc2b99ca50f-415x250-IndiaHerald.jpgఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమై వారం పూర్తి కావస్తోంది. మొన్న ఆదివారం నాడు బిగ్ బాస్ సీజన్ 8 మొదలైంది. ఈ రోజు శనివారం వచ్చేసింది. ప్రతి బిగ్ బాస్ సీజన్ లాగానే ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే విషయం మీద లీక్స్ వచ్చేశాయి. నిజానికి మొదటి వారం నామినేషన్స్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. విష్ణు ప్రియా, శేఖర్ బాషా, ఆకుల సోనియా, బెజవాడ బేబక్క, మణికంఠ, పృథ్వి శెట్టి వంటి వాళ్ళు నామినేషన్ లో ఉన్నారు. ఇక ఈ ఆరుగురి విషయంలో నామినేషన్స్ లో మణికంఠను హౌస్ లో ఉన్న వాళ్ళందరూ tollywood{#}jyothi;prudhvi raj;vishnu;Bigboss;sekhar;Yevaru;Kannada;sunday;House;Saturday;Teluguబిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న బుల్లితెర హాట్ బ్యూటీ..!?బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న బుల్లితెర హాట్ బ్యూటీ..!?tollywood{#}jyothi;prudhvi raj;vishnu;Bigboss;sekhar;Yevaru;Kannada;sunday;House;Saturday;TeluguSun, 08 Sep 2024 17:05:00 GMTఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమై వారం పూర్తి కావస్తోంది. మొన్న ఆదివారం నాడు బిగ్ బాస్ సీజన్ 8 మొదలైంది. ఈ రోజు శనివారం వచ్చేసింది. ప్రతి బిగ్ బాస్ సీజన్ లాగానే ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే విషయం మీద లీక్స్ వచ్చేశాయి. నిజానికి మొదటి వారం నామినేషన్స్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. విష్ణు ప్రియా, శేఖర్ బాషా, ఆకుల సోనియా, బెజవాడ బేబక్క, మణికంఠ, పృథ్వి శెట్టి వంటి వాళ్ళు నామినేషన్ లో ఉన్నారు. ఇక ఈ ఆరుగురి విషయంలో నామినేషన్స్ లో మణికంఠను హౌస్ లో ఉన్న వాళ్ళందరూ టార్గెట్ చేయడంతో అతని మీద సింపతి వర్కౌట్ అయ్యి

 మొదటి టాప్ ప్లేస్ లోకి వచ్చేసాడు. ఇక ఈ వారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. ఆమెను దాదాపు హౌస్ నుంచి బయటకు పంపడం ఖాయం అయిపోయినట్లుగానే ప్రచారం జరుగుతోంది. అందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయనేది చూడాలి. అయితే ఎలిమినేషన్లు జరుగుతుండగానే హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలను రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలుగు, కన్నడ ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న జ్యోతి రాయ్ అలియాస్ జగతి మేడం వైల్డ్ కార్డు ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతున్నట్లు సమాచారం. కాగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభానికి ముందు జ్యోతిరాయ్‌ని

 సంప్రదించారట. అయితే ఆమె తన షూటింగుల్లో బిజీగా ఉండడంతో రెగ్యులర్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లలేని పరిస్థితి ఉందట. తన పెండింగ్ షూటింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాతే బిగ్ బాస్ హౌస్ లోకి వస్తానని కరాఖండిగా చెప్పేసిందట జగతి మేడమ్. జగతి మేడమ్ సమాధానం తో సంతృప్తి చెందిన బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను వైల్డ్ కార్డు ఎంట్రీకి అవకాశం ఇచ్చారట. దీనికి ఆమె కూడా అంగీకరించిందట. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే బిగ్ బాస్ నాలుగో వారం లేదా ఐదో వారంలో జగతి మేడమ్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్ట వచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>