MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedతెలుగులో ప్రస్తుతం యాంకర్ సుమ కనకాల హవా నడుస్తోంది. ఈవెంట్ ఏదైనా ఆమె మాటలు వినిపించాల్సిందే. తనదైన వ్యాఖ్యానంతో కార్యక్రమానికి సరికొత్త శోభ తెస్తోంది. అలాంటి సుమకు ఓ అందాల యాంకరమ్మ పోటీ అనుకున్నారు. అందం, అభినయం కలగలసిన రూపం ఆమెది. తన మాటల గలగలలతో ప్రేక్షకులకు కట్టేపడేసింది. బుల్లితెర, వెండి తెరపైన కూడా ఆమె ఆడిపాడింది. సినీ, టీవీ ప్రేక్షకులను ఆమె ఎంతగానో ఆకట్టుకుంది. అయితే అంతలోనే ఆమె ప్రేక్షకులకు కనిపించడం మానేసింది. దీంతో తమ అభిమాన యాంకర్‌ కనిపించకపోయే సరికి ఫ్యాన్స్ ఢీలా పడ్డారు. అయితే తిరిగిbhanu {#}madhumati;suma kanakala;udaya bhanu;Santosham;Journey;gold;Audience;Silver;Event;televisionఅకస్మాత్తుగా కనిపించడం మానేసిన అందాల యాంకరమ్మ.. ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతోంది!అకస్మాత్తుగా కనిపించడం మానేసిన అందాల యాంకరమ్మ.. ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతోంది!bhanu {#}madhumati;suma kanakala;udaya bhanu;Santosham;Journey;gold;Audience;Silver;Event;televisionSun, 08 Sep 2024 12:00:00 GMTతెలుగులో ప్రస్తుతం యాంకర్ సుమ కనకాల హవా నడుస్తోంది. ఈవెంట్ ఏదైనా ఆమె మాటలు వినిపించాల్సిందే. తనదైన వ్యాఖ్యానంతో కార్యక్రమానికి సరికొత్త శోభ తెస్తోంది. అలాంటి సుమకు ఓ అందాల యాంకరమ్మ పోటీ అనుకున్నారు. అందం, అభినయం కలగలసిన రూపం ఆమెది. తన మాటల గలగలలతో ప్రేక్షకులకు కట్టేపడేసింది. బుల్లితెర, వెండి తెరపైన కూడా ఆమె ఆడిపాడింది. సినీ, టీవీ ప్రేక్షకులను ఆమె ఎంతగానో ఆకట్టుకుంది. అయితే అంతలోనే ఆమె ప్రేక్షకులకు కనిపించడం మానేసింది. దీంతో తమ అభిమాన యాంకర్‌ కనిపించకపోయే సరికి ఫ్యాన్స్ ఢీలా పడ్డారు. అయితే తిరిగి ఇప్పుడిప్పుడే ఆ అందాల యాంకర్ తన జర్నీ ప్రారంభించింది. ఆమె ఎవరో కాదు.. యాంకర్ ఉదయ భాను. పెళ్లయ్యాక ఆమెకు ట్విన్స్ పుట్టారు. దీంతో భర్త, పిల్లల ఆలనాపాలనా చూసుకోవడంలో ఆమె బిజీ అయిపోయింది. తిరిగి ప్రేక్షకులను తన వ్యాఖ్యానంతో అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పుడిప్పుడే కొన్ని టీవీ షోలలో కనిపిస్తూ సందడి చేస్తోంది.
కొన్నేళ్ల క్రితం ఏ టీవీ ఛానల్ పెట్టినా యాంకర్ ఉదయభాను కనిపించేది. తనదైన వ్యాఖ్యానంతో ఆ టీవీ షోను మరింత ఆసక్తికరంగా నడిపించేది. సాహసం చేయరా డింభకా, వన్స్ మోర్ ప్లీజ్, హృదయాంజలి, జానవులే నెర జానవులే, ఛాంగురే బంగారు లేడి, లక్స్ డ్రీమ్ గర్ల్, తీన్ మార్, డ్యాన్సింగ్ స్టార్, రంగం, రేలా రే రేలా, ఢీ ఇలా ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్‌లలో ఆమె యాంకర్‌గా సందడి చేసేది. పెళ్లయ్యాక ఆమె అకస్మాత్తుగా తన యాంకరింగ్‌ను ఆపేసింది. దీంతో ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇటీవలే ఓ టీవీ షోలో ఆమె పాల్గొంది. తాను ప్రొఫెషనల్ కెరీర్‌ను ఆపేయడానికి గల కారణాన్ని చెప్పి, భావోద్వేగానికి గురైంది. ప్రెగ్నన్సీ వచ్చాక తాను యాంకరింగ్‌ను వదిలేసినట్లు చెప్పింది. తిరిగి ఇప్పుడిప్పుడే ఆమె పుంజుకుంటోంది. తన లైఫ్‌లో తనకు ఎదురైన కొన్ని అనుభవాలను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఇక యాంకర్‌గానే కాకుండా ఆమె పలు సినిమాలలోనూ నటించింది. కొండవీటి సింహాసనం, ఎర్ర సైన్యం, ఆపద మొక్కుల వాడు, శ్రావణ మాసం, జులాయి, లీడర్, మధుమతి వంటి సినిమాల్లో నటిగా, స్పెషల్ సాంగ్స్ కూడా చేసి సినీ ప్రేక్షకులను ఆమె అలరించింది. తిరిగి ఇప్పుడిప్పుడే ఆమె తన యాంకరింగ్ కెరీర్‌‌ను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>