SportsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/moeen-ali-572b9773-74d2-4c1c-ac76-9c80f4d6f1d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/moeen-ali-572b9773-74d2-4c1c-ac76-9c80f4d6f1d2-415x250-IndiaHerald.jpgమొయిన్ ఆలీ ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ అన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ లో సీఎస్‌కే ప్లేయర్‌ గా కూడా రాణిస్తున్నాడు మొయిన్ ఆలీ. ఇతను అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పి తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. 2014లో క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన ఈ స్టార్ ఆల్ రౌండర్ తన సుదీర్ఘ కెరీర్ లో ఇప్పటివరకు 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20లు ఆడడం జరిగింది. Moeen Ali {#}VIRAT KOHLI;England;history;Chennai;INTERNATIONAL;Cricket;ali rezaకోహ్లీని టార్చర్ చేసిన RCB ప్లేయర్‌ కెరీర్‌ క్లోజ్‌ ..?కోహ్లీని టార్చర్ చేసిన RCB ప్లేయర్‌ కెరీర్‌ క్లోజ్‌ ..?Moeen Ali {#}VIRAT KOHLI;England;history;Chennai;INTERNATIONAL;Cricket;ali rezaSun, 08 Sep 2024 16:50:00 GMTమొయిన్ ఆలీ ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ అన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ లో సీఎస్‌కే ప్లేయర్‌ గా కూడా రాణిస్తున్నాడు మొయిన్ ఆలీ. ఇతను అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పి తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. 2014లో క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన ఈ స్టార్ ఆల్ రౌండర్ తన సుదీర్ఘ కెరీర్ లో ఇప్పటివరకు 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20లు ఆడడం జరిగింది.


అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 6,600 కి పైగా స్కోర్ నమోదు చేసుకున్నాడు. ఇక బౌలింగ్ లోను అద్భుతంగా రాణించిన ఈ క్రికెటర్ ఇప్పటివరకు 360+వికెట్లను పడగొట్టి రికార్డుల్లోకి ఎక్కాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న మొయిన్ ఆలీ అందులోనూ ఆడిన 67 మ్యాచుల్లో 1,162 పరుగులు, 35 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.

ఈ క్రమంలో మొయిన్ ఆలీమాట్లాడుతూ...."నాకిప్పుడు 37 సంవత్సరాలు. ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ కు నేను ఎంపిక కాలేకపోయాను. ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు అర్థం కావడం లేదు. ఇప్పటికే ఇంగ్లాండ్ తరఫున ఎన్నో మ్యాచులు ఆడాను. ఇక కొత్తతరం జట్టులోకి రావాల్సిన సమయం వచ్చింది. నేను రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ నాకు ఎలాంటి బాధలేదు. ఇప్పటికీ నేను క్రికెట్ ఆడగలను. కానీ జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడే సరైన సమయం అని భావిస్తున్నాను" అని తాజాగా తన రిటైర్మెంట్ పై సమాధానమిచ్చాడు మొయిన్ ఆలీ.

కాగా, భారత జట్టుపై మొయిన్ ఆలీకి మంచి రికార్డులు ఉన్నాయి. ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని మొయిన్ ఆలీ తన బౌలింగ్ లో పదిసార్లు అవుట్ చేయడం జరిగింది. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఐపీఎల్ లో అతను ఎన్నోసార్లు చెన్నై జట్టు విజయం కోసం బలమైన ప్రదర్శనలు చేశాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>