MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5e2ae5ab-9a12-4e71-8835-2996daf413b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5e2ae5ab-9a12-4e71-8835-2996daf413b9-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న కంగువ చిత్రంపై ఫుల్ హైప్ ఉంది. ఈ ఫ్యాంటసీ యాక్షన్ సినిమాకు సిరుతై శివ దర్శకత్వం వహించారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఈ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేసింది. భారీ బడ్జెట్‍తో పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం రూపొందింది. అక్టోబర్ 10వ తేదీన కంగువ మూవీని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. ఇక కంగువ సినిమాలో సూర్యకు జోడీగా దిశా పటానీ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. నటరాజన్ సుబ్రమణియం, జగపతి బాబు, యోగిబాబు, రెడిన్ కింగ్‍స్లే,tollywood{#}Bobby Deol;ali;anand malayalam actor;vennela;Anand Deverakonda;Shiva;lord siva;October;surya sivakumar;Dalapathi;Joseph Vijay;Hindi;India;Chitram;Cinema;bollywood;Musicకంగువ.. ఎట్టకేలకు ఆ కండిషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారుగా..!?కంగువ.. ఎట్టకేలకు ఆ కండిషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారుగా..!?tollywood{#}Bobby Deol;ali;anand malayalam actor;vennela;Anand Deverakonda;Shiva;lord siva;October;surya sivakumar;Dalapathi;Joseph Vijay;Hindi;India;Chitram;Cinema;bollywood;MusicSun, 08 Sep 2024 16:55:00 GMTతమిళ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న కంగువ చిత్రంపై ఫుల్ హైప్ ఉంది. ఈ ఫ్యాంటసీ యాక్షన్ సినిమాకు సిరుతై శివ దర్శకత్వం వహించారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఈ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేసింది. భారీ బడ్జెట్‍తో పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం రూపొందింది. అక్టోబర్ 10వ తేదీన కంగువ మూవీని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. ఇక కంగువ సినిమాలో సూర్యకు జోడీగా దిశా పటానీ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. నటరాజన్ సుబ్రమణియం, జగపతి బాబు, యోగిబాబు, రెడిన్ కింగ్‍స్లే, కోవై సరళ, వెన్నెల కిశోర్, మన్సూర్ అలీ ఖాన్, రియాజ్ ఖాన్, ఆనంద్

 రాజా కీలకపాత్రలు పోషించారు. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు. అయితే దేశ వ్యాప్తంగా కంగువా చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉంటే నార్త్ లో మల్టీప్లెక్స్ థియేటర్స్ అసోసియేషన్ పెట్టిన రూల్స్ కాస్తా సౌత్ నుంచి రిలీజ్ అయ్యే పాన్ ఇండియా చిత్రాలకి ఇబ్బందిగా మారాయి. నార్త్ లో మల్టీ ప్లెక్స్ చైన్స్ లో సినిమాని ప్రదర్శించాలంటే 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనకి ఒప్పుకుంటేనే అక్కడ మల్టీప్లెక్స్ లలో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ ఒప్పుకోకపోతే మల్టీప్లెక్స్ లలో ఆ సినిమాలని ప్రదర్శించడం లేదు.

 తమిళంలో దళపతి విజయ్ లియో, GOAT సినిమాలు రెండు కూడా హిందీలో మల్టీప్లెక్స్ పెట్టిన 8 వారాల నిబంధనకి అంగీకరించలేదు. దీంతో ఆ సినిమాల హిందీ వెర్షన్స్ ని 3 మల్టీప్లెక్స్ చైన్ థియేటర్స్ లో ప్రదర్శించలేదు. కేవలం సింగిల్ స్క్రీన్స్ కి మాత్రమే ఆ సినిమాలు పరిమితం అయ్యాయి. సూర్య కంగువా సినిమాకి అలాంటి పరిస్థితి ఎదురవుతుందని అందరూ భావించారు. అయితే ఓటీటీ రైట్స్ కోసం కంగువా నిర్మాతలు థియేటర్స్ కలెక్షన్స్ ని పోగొట్టుకోవాలని అనుకోవడం లేదంట. అందుకే కంగువా నిర్మాతలు మల్టీప్లెక్స్ అసోసియేషన్ పెట్టిన కండిషన్ కి ఒప్పుకున్నారంట. దీంతో నార్త్ ఇండియాలో అన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ లలో కంగువా రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. ..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>