ViralFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/sunitawilliams0c676484-60af-4adf-8a0c-7325c494ea80-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/sunitawilliams0c676484-60af-4adf-8a0c-7325c494ea80-415x250-IndiaHerald.jpgఅంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్.. ఇప్పట్లో తిరిగి వచ్చేల పరిస్థితులు కనిపించట్లేదు. ఇంకొన్ని నెలల పాటు ఆమె అక్కడే గడపడబోతున్నారు. మరో వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోర్‌తో కలిసి ఐఎస్ఎస్‌లో ఇంకొంతకాలం ఉండబోతోన్నారు.వారిని భూమి మీదికి తీసుకుని రావడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పంపించిన స్పేస్‌క్రాఫ్ట్ ఉత్త చేతులతో భూమికి తిరిగొచ్చింది. సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్‌ అందులో ట్రావెల్ చేయట్లేదు. ఐఎసsunitawilliams{#}NASA;Yatra;June;INTERNATIONAL;American Samoa;Saturdayఅంతరిక్షం: సునీతా విలియమ్స్ లేకుండానే భూమికి చేరిన స్టార్ లైనర్.!అంతరిక్షం: సునీతా విలియమ్స్ లేకుండానే భూమికి చేరిన స్టార్ లైనర్.!sunitawilliams{#}NASA;Yatra;June;INTERNATIONAL;American Samoa;SaturdaySat, 07 Sep 2024 17:26:04 GMTఅంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్.. ఇప్పట్లో తిరిగి వచ్చేల పరిస్థితులు కనిపించట్లేదు. ఇంకొన్ని నెలల పాటు ఆమె అక్కడే గడపడబోతున్నారు. మరో వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోర్‌తో కలిసి ఐఎస్ఎస్‌లో ఇంకొంతకాలం ఉండబోతోన్నారు.వారిని భూమి మీదికి తీసుకుని రావడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పంపించిన స్పేస్‌క్రాఫ్ట్ ఉత్త చేతులతో భూమికి తిరిగొచ్చింది. సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్‌ అందులో ట్రావెల్ చేయట్లేదు. ఐఎస్ఎస్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది.ఈ ఏడాది జూన్‌లో సునీతా విలియమ్స్‌ బ్యారీ బుచ్ విల్మోర్‌ను అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి పంపించింది నాసా. ఇది 10 రోజుల ఆపరేషన్. అక్కడ తలెత్తిన కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులను సరిచేయడానికి వారిద్దరినీ స్టార్‌ లైనర్ స్పేస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అక్కడికి పంపింది.తిరిగి రావడం మాత్రం సాధ్యపడట్లేదు. స్టార్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో థ్రస్టర్లు పనిచేయకపోవడం, హీలియం లీక్ కావడం సహా అనేక సాంకేతిక సమస్యల కారణంగా వారిద్దరూ అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది.ఇదిలావుండగా అమెరికన్ ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్ , బ్యారీ ఇ విల్మోర్ లను అమెరికా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్.. ప్రస్తుతం వారు లేకుండానే భూమ్మీదకు దిగింది. భారత కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో బోయింగ్ క్యాప్సూల్ పారాచూట్ సహాయంతో భూమ్మీద దిగింది. అయితే ఈ క్యాప్సూల్ ఉదయం 6 గంటలకు స్పేస్ స్టేషన్ నుంచి బయలుదేరి, మెక్సికోలోని వైట్ సాండ్స్ స్పేస్ హార్బర్ లోకి కిందకి పంపినట్లు స్టార్ లైనింగ్ కంపెనీకి చెందిన శాస్త్ర వేత్తలు వెల్లడించారు.కాగా జూన్ 5, 2024 న కేవలం 10 రోజుల మిషన్ లో భాగంగా సునీతా, బ్యారీ లు రోదసీ యాత్ర చేపట్టారు. అయితే వీరిద్దరూ జూన్ 14 తేదీన భూమ్మీదకు రావాల్సి ఉండగా స్టార్ లైన్ వ్యోమనౌకలో హీలియం గ్యాస్ లీకేజి కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ల్యాండింగ్ ను వాయిదా వేశారు. ఆ తర్వాత మరోసారి జూన్ 26 వ తేదీన వీరిద్దరూ భూమ్మీదకు రానున్నట్లు నాసా ప్రకటించగా అదికూడా వాయిదా పడింది. ఇలా పలుమార్లు వారి తిరుగు ప్రయాణాన్ని వాయిదా పడుతూ రాగా.. చివరికి బోయింగ్ స్టార్ లైనర్ సునీతా, బ్యారీ ఇద్దరూ లేకుండానే భూమిని చేరింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>