Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/floadsd1c7a298-bad9-4f27-b9c5-ce39a2bde805-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/floadsd1c7a298-bad9-4f27-b9c5-ce39a2bde805-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు ఎంతలా బీభత్సం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక మునుపెన్నడు లేనివిధంగా భారీ వరదలు రావడంతో ఎన్నో ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. పెద్ద పెద్ద బిల్డింగులు సైతం వరద ప్రవాహంలో మునిగిపోయాయి. దీంతో జనావాసాలు స్తంభించిపోయి ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఎంతోమంది వరదల్లో కొట్టుకుపోయి.. ప్రాణాలు కూడా కోల్పోయారు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. అయితే ఇలా తెలుగు రాషfloads{#}Driver;Hyderabad;Hero;media;Telangana;News;Teluguవిరాళం ఇచ్చింది రూ.780 మాత్రమే.. కానీ అతను నిజంగా రియల్ హీరో?విరాళం ఇచ్చింది రూ.780 మాత్రమే.. కానీ అతను నిజంగా రియల్ హీరో?floads{#}Driver;Hyderabad;Hero;media;Telangana;News;TeluguSat, 07 Sep 2024 10:05:00 GMTతెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు ఎంతలా బీభత్సం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక మునుపెన్నడు లేనివిధంగా భారీ వరదలు రావడంతో ఎన్నో ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. పెద్ద పెద్ద బిల్డింగులు సైతం వరద ప్రవాహంలో మునిగిపోయాయి. దీంతో జనావాసాలు స్తంభించిపోయి ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఎంతోమంది వరదల్లో కొట్టుకుపోయి.. ప్రాణాలు కూడా కోల్పోయారు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి.


 అయితే ఇలా తెలుగు రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేసిన నేపథ్యంలో.. ఇలా సహాయక చర్యలకు గాను ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని రెండు రాష్ట్రాల వరద బాధితుల సహాయార్థం విరాళంగా ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ఇక కేవలం సినీ ప్రముఖులు మాత్రమే కాదు ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ రోజు వారి వేతనాన్ని ఇలా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అందించారు అన్న విషయం తెలిసిందే. ఇలా విపత్తు సమయంలో మానవతా దృక్పథాన్ని చాటుకొని హీరోలుగా నిలిచిన వారి గురించి సోషల్ మీడియాలో వార్తలు ప్రత్యక్షమవుతున్నాయ్. అయితే ఇక్కడ ఒక వ్యక్తి డొనేట్ చేసింది కేవలం 780 రూపాయలు మాత్రమే.


 కానీ అతను రియల్ హీరో అంటూ సోషల్ మీడియా అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటి 780 రూపాయలకే అంతలా హీరో అంటూ ఎత్తేయడం ఎందుకు అనుకుంటున్నారు కదా. కోట్ల రూపాయలు సంపాదించే కొంతమంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకుల వరదలు వచ్చిన సమయంలో మాకెందుకులే అని విరాళాలు ప్రకటించకుండా సైలెంట్ గా ఉంటే.. రెక్కాడితే గాని డొక్కాడని  పరిస్థితిలో ఉన్న ఒక సాదాసీదా రాపిడో డ్రైవర్.. తన రోజువారి సంపాదన వరద బాధితుల కోసం విరాళం ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నాడు. హైదరాబాద్ చంపపేట్ కి చెందిన సాయి అనే రాపిడో డ్రైవర్ తాను ఒకరోజు మొత్తంలో 780 రూపాయలు సంపాదించానని.. ఈ డబ్బు మొత్తాన్ని ఇక వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ అకౌంట్ కి పంపుతున్నాను అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇది చిన్నపాటి సాయమే కానీ నా వంతుగా అయ్యింది నేను చేశాను అంటూ తెలిపాడు. దీంతో అతను రియల్ హీరో అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>