MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode840723d-fd02-44a8-899a-cee8048f4126-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode840723d-fd02-44a8-899a-cee8048f4126-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెరపై దాదాపు రెండు దశాబ్దాలుగా తన హవాను చూపిస్తోంది యాంకర్ సుమ. అద్భుతమైన అందం, అంతకు మించిన మాటలతో అందరినీ మెస్మైరైజ్ చేస్తూ.. ఎన్నో ఆఫర్లను అందిపుచ్చుకుంటోంది. ఒకపక్క గ్లామర్‌తో కొత్త కొత్త యాంకర్లు పోటీ ఇస్తున్నా... తన ప్రత్యేకమైన నైపుణ్యంతో వాళ్లందరినీ వెనక్కి నెట్టేస్తోంది. ఈ క్రమంలోనే మరిన్ని షోలు, ఈవెంట్లు, సినిమా ఫంక్షన్లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అలాగే ఇటీవలే ఓ సినిమా కూడా చేసింది. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా పెట్టి వరుసగా వీడియోలు విడుదల చేస్తుంది. ఇక కెరియర్ tollywood{#}roshan;suma;suma kanakala;you tube;vishwa;Chitram;Darsakudu;Director;producer;Producer;Population;Tollywood;Cinemaవినాయక చవితి స్పెషల్.. సుమ కొడుకు రోషన్ కొత్త సినిమా పోస్టర్..!?వినాయక చవితి స్పెషల్.. సుమ కొడుకు రోషన్ కొత్త సినిమా పోస్టర్..!?tollywood{#}roshan;suma;suma kanakala;you tube;vishwa;Chitram;Darsakudu;Director;producer;Producer;Population;Tollywood;CinemaSat, 07 Sep 2024 17:45:00 GMTతెలుగు బుల్లితెరపై దాదాపు రెండు దశాబ్దాలుగా తన హవాను చూపిస్తోంది యాంకర్ సుమ. అద్భుతమైన అందం, అంతకు మించిన మాటలతో అందరినీ మెస్మైరైజ్ చేస్తూ.. ఎన్నో ఆఫర్లను అందిపుచ్చుకుంటోంది. ఒకపక్క గ్లామర్‌తో కొత్త కొత్త యాంకర్లు పోటీ ఇస్తున్నా... తన ప్రత్యేకమైన నైపుణ్యంతో వాళ్లందరినీ వెనక్కి నెట్టేస్తోంది. ఈ క్రమంలోనే మరిన్ని షోలు, ఈవెంట్లు, సినిమా ఫంక్షన్లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అలాగే ఇటీవలే ఓ సినిమా కూడా చేసింది. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా పెట్టి వరుసగా వీడియోలు విడుదల చేస్తుంది. ఇక కెరియర్ పరంగా టీవీలీ షోలు చేస్తూ.. పిల్లలను చూసుకోకుండా

 ఉండడం కంటే ఇంట్లోనే ఉండి పనులు చేసుకునేలా ప్లాన్ చేసుకుంటుందట. అందుకే ఒక్క సుమ అడ్డా షో తప్ప మరేవీ చేయకుండా.. యూట్యూబ్ పై ఫోకస్ చేసిందట. ఇక మిగతా సమయాల్లో కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్లకు మాత్రమే వెళ్తుందట. అయితే టాలీవుడ్ లో ఇంతలా పేరు తెచ్చుకున్న సుమ తన కొడుకును టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసింది. ఇప్పటికే సుమా కొడుకు రోషన్ హీరోగా నటించిన ఒక సినిమా విడుదల అయింది కూడా. ఇక ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ రోజు వినాయక చతుర్థి శుభ సందర్భంగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.

 తన తొలి చిత్రం కలర్ ఫోటోతో జాతీయ అవార్డును గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్, ఫారెస్ట్ నేపథ్యంలో సాగే సమకాలీన ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సుమ-రాజీవ్ కనకాలల కుమారుడు రోషన్ కనకాల ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రోషన్ కనకాల తన కండలు తిరిగిన దేహాన్ని చూపిస్తూ తనదైన చిరునవ్వుతో మెరిసిపోతూ కనిపించాడు. దట్టమైన అడవి మధ్యలో గుర్రంతో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి మోగ్లీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.. ఇక మోగ్లీ జంగిల్ బుక్‌లోని ప్రముఖ పాత్ర అని తెలిసిందే...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>