ViralSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/difficulty-of-delivery-agent-for-daughteref972ae8-85a5-4ff9-9955-5197b133765c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/difficulty-of-delivery-agent-for-daughteref972ae8-85a5-4ff9-9955-5197b133765c-415x250-IndiaHerald.jpgప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమ వెలకట్టలేనిది. వారి ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లల కోసం వారు పడే కష్టాలకు ఒక్కోసారి హద్దులు కూడా ఉండవు. పిల్లల కోసం ఎలాంటి సాహసాన్నైనా చేసేందుకు వెనకంజ వేయరు. అయితే ఇందుకు తగ్గట్టుగానే.. తాజాగా ఒక డెలివరీ బాయ్ పడే కష్టం అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. తండ్రి ప్రేమ అంటే అసలైన నిదర్శనం ఇదేనా అన్నట్లుగా ఉంది ఆ డెలివరీ ఏజెంట్ కష్టం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు కి వెళ్తే.. viral {#}Zomato;Santosham;Athadu;prema;Love;Father;Varsham;media;Hero;netizensవైరల్: కూతురి కోసం డెలివరీ ఏజెంట్ కష్టాలు..!వైరల్: కూతురి కోసం డెలివరీ ఏజెంట్ కష్టాలు..!viral {#}Zomato;Santosham;Athadu;prema;Love;Father;Varsham;media;Hero;netizensFri, 06 Sep 2024 11:45:00 GMTప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమ వెలకట్టలేనిది. వారి ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లల కోసం వారు పడే కష్టాలకు ఒక్కోసారి హద్దులు కూడా ఉండవు. పిల్లల కోసం ఎలాంటి సాహసాన్నైనా చేసేందుకు వెనకంజ వేయరు. అయితే ఇందుకు తగ్గట్టుగానే.. తాజాగా ఒక డెలివరీ బాయ్ పడే కష్టం అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. తండ్రి ప్రేమ అంటే అసలైన నిదర్శనం ఇదేనా అన్నట్లుగా ఉంది ఆ డెలివరీ ఏజెంట్ కష్టం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు కి వెళ్తే..

ఢిల్లీలోని  ఖాన్‌ మార్కెట్‌ లో ఉన్న స్టార్‌బక్స్ లో ఒక సంఘటన చోటుచేసుకుంది. ఒక ఆర్డర్ ను పికప్ చేసుకునేందుకు ఒక డెలివరీ రెండు సంవత్సరాల కూతురిని వెంట తీసుకొని స్టోర్ దగ్గరికి వచ్చాడు. ఈ డెలివరీ ఏజెంట్ ను చూడగానే ఒక్కసారిగా స్టోర్ మేనేజర్ ఆశ్చర్యపోయాడు. ఈ క్రమంలో ఆ స్టోర్ మేనేజర్ సోషల్ మీడియా వేదికగా.. ‘‘ఈ రోజు ఓ డెలివరీ ఏజెంట్ మా స్టోర్‌‌కు వచ్చాడు. వ్యక్తిగత జీవితంలో పలు సవాళ్లను ఎదుర్కొంటున్నా అతడు కూతురి కోసం కష్టపడుతున్న తీరు మమ్మల్ని కదిలించింది. చిన్నారిని వెంట తీసుకునే అతడు పనిలోకి వచ్చాడు. కూతురి పట్ల అతడికున్న ప్రేమ, పని పట్ల నిబద్ధత గొప్పది’ అంటూ తెలియజేశాడు.. అంతేకాకుండా అతని కూతురు పట్ల జాగ్రత్తగా వహిస్తూ తన పని తాను చేసుకోవడం అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది.
అంతటితో ఆగకుండా స్టార్ బక్స్ సిబ్బంది వారు ఆ చిన్నారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన డ్రింకును కూడా ఇచ్చారు... అలాగే డెలివరీ ఏజెంట్ మాట్లాడుతూ.. ‘‘చిన్నారికి బేబేచీనో ఇవ్వడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. చిన్నారి మోముపై నవ్వు చూసి మా మనసులు సంతోషంతో నిండిపోయాయి" అని అన్నారు. సోనూ కష్టం చూస్తుంటే మానవాళి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోగలరన్న నమ్మకం కలుగుతోంది. సోనూ కుటుంబంలో కలకలం సంతోషం వెల్లివిరియాలని, అలాగే సిరిసంపదలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంటూ తెలియజేశాడు. ఈ సంఘటనపై జొమాటో సంస్థ కూడా స్పందించింది. తమ డెలివరీ ఏజెంట్ కష్టాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలని తెలియజేసింది.. ఇక ఈ సంఘటన చూసిన కొంత మంది నెటిజన్స్ డెలివరీ ఏజెంట్ కష్టానికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. అలాగే "యు ఆర్ ద రియల్ హీరో " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>