MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3627f787-d3af-4590-87c1-28a86e8c9750-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3627f787-d3af-4590-87c1-28a86e8c9750-415x250-IndiaHerald.jpgమెగా హీరో సాయి ధరమ్ తేజ్ గతేడాది ‘విరూపాక్ష’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. హర్రర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అద్భుతమైన స్టోరీ, స్క్రీన్ ప్లే తో విమర్శకుల ప్రశంసలను పొందింది. ఇక ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ #SDT18 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై SDT18 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రోహిత్‌ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి tollywood{#}aishwarya;sai dharam tej;Tamil;king;King;Posters;Hello;BEAUTY;Chitram;Blockbuster hit;Horror;Kannada;Director;Hero;Heroine;Cinemaమెగా మేనల్లుడు తో ఐశ్వర్య లక్ష్మి.. ఫస్ట్ లుక్ అదుర్స్..!?మెగా మేనల్లుడు తో ఐశ్వర్య లక్ష్మి.. ఫస్ట్ లుక్ అదుర్స్..!?tollywood{#}aishwarya;sai dharam tej;Tamil;king;King;Posters;Hello;BEAUTY;Chitram;Blockbuster hit;Horror;Kannada;Director;Hero;Heroine;CinemaFri, 06 Sep 2024 17:35:00 GMTమెగా హీరో సాయి ధరమ్ తేజ్ గతేడాది ‘విరూపాక్ష’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. హర్రర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అద్భుతమైన స్టోరీ, స్క్రీన్ ప్లే తో విమర్శకుల ప్రశంసలను పొందింది. ఇక ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ #SDT18 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై SDT18 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రోహిత్‌ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు.  అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సినిమా నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రివీల్

 చేశారు. ఈ మూవీలో కన్నడ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఐశ్వర్య పాత్రను పరిచయం చేస్తూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఐశ్వర్య ‘వసంత’ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు. ఐశ్వర్య లక్ష్మీ పొన్నియన్ సెల్వన్, గార్గి, అమ్ము, గాడ్సే, కింగ్ ఆఫ్ కొత్త వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ SDT18 తో పాటు తమిళ్ లో తగ్ లైఫ్, మాలయంలో హలో మమ్మీ చిత్రాల్లో నటిస్తోంది.  ప్రస్తుతం ఐశ్వర్య ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెస్ట్ ఆఫ్ లక్ తో పాటు బర్త్ డే విషెస్ కూడా చెబుతున్నారు నెటిజన్లు. పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉందని

 చెబుతున్నారు. ఎడారిలో నడుస్తూ వెళుతున్న ఆమె లుక్.. సినిమాపై అంచనాలు పెంచుతుందని అంటున్నారు. ప్రస్తుతం SDT 18 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. 1947 హిస్టరీ బ్యాక్‌ డ్రాప్‌ లో రాబోతున్న SDT18 చిత్రంలో సాయి తేజ్ ఒక యోధుడి పాత్రలో నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుందని తెలుస్తోంది...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>