ViralFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/soonusudc98eb1e7-5962-4d31-aeb8-c40c0c2f1e56-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/soonusudc98eb1e7-5962-4d31-aeb8-c40c0c2f1e56-415x250-IndiaHerald.jpg* రీల్ లైఫ్ విలన్.. రియల్ లైఫ్ లో హీరో..! * కలియుగ కర్ణుడిలా కనిపిస్తున్న సోనూసూద్..! * హెల్ప్ చేయడంలో బ్రాండ్ అంబాసిడర్.! (ఏపీ-ఇండియాహెరాల్డ్ ): ఏపీలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడ జిల్లాను వరదలు ముంచెత్తాయి. ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో వరద తీవ్రత తగ్గినా దాని ప్రభావం వారి జీవితాలను అతలాకుతలం చేసింది.అయితే వరద బాధితులకు సీఎం ఆదేశాల మేరకు ఆహార సరఫరా కొనసాగుతోంది.వరద బాధితులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పsoonusud{#}Chittoor;war;Arundhati;Coronavirus;Varsham;Telangana Chief Minister;Telangana;CBN;CM;Andhra Pradesh;Vijayawada;Service;Heroవరదల్లో రియల్ హీరో: హెల్పింగ్ కే బ్రాండ్ అంబాసిడర్ గా ఎదిగిన స్టార్ 'సోనూసూద్'..!వరదల్లో రియల్ హీరో: హెల్పింగ్ కే బ్రాండ్ అంబాసిడర్ గా ఎదిగిన స్టార్ 'సోనూసూద్'..!soonusud{#}Chittoor;war;Arundhati;Coronavirus;Varsham;Telangana Chief Minister;Telangana;CBN;CM;Andhra Pradesh;Vijayawada;Service;HeroFri, 06 Sep 2024 10:07:56 GMT* రీల్ లైఫ్ విలన్.. రియల్ లైఫ్ లో హీరో..!
* కలియుగ కర్ణుడిలా కనిపిస్తున్న సోనూసూద్..!
* హెల్ప్ చేయడంలో బ్రాండ్ అంబాసిడర్.!

(ఏపీ-ఇండియాహెరాల్డ్ ): ఏపీలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడ జిల్లాను వరదలు ముంచెత్తాయి. ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో వరద తీవ్రత తగ్గినా దాని ప్రభావం వారి జీవితాలను అతలాకుతలం చేసింది.అయితే వరద బాధితులకు సీఎం ఆదేశాల మేరకు ఆహార సరఫరా కొనసాగుతోంది.వరద బాధితులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమకు చేతనైనంతలో ముఖ్యమంత్రి సహాయ నిధికి సహకరించాలని బహిరంగ ప్రకటనలో కోరారు. ఈ వినాశకరమైన పరిస్థితిలో నష్టపోయిన వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని ఆయన కోరారు.దాంతో విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి సినీ తారలు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కదిలి వస్తున్నారు.

దేవో మనిష్య రూపేనా అనేది వేదాల్లోని మాట. దేవుడు ఎక్కడి నుంచో దిగిరాడు మనిషి రూపంలోనే కష్టాల్లో ఉన్నప్పుడు మానవుడి రూపేనా అందించే సాయాన్నిబట్టి దేవుడు వచ్చాడని అర్థమవుతుంది. ఇస్తూ ఉంటే ఇంకా ఇంకా ఇవ్వాలనిపిస్తూ ఉంటుంది అన్నాడు ఒక కవి. అలాంటి సాయగుణం ఉన్నటువంటి వ్యక్తుల్లో ఏమాత్రం పరిచయం అవసరం లేని వ్యక్తుల్లో సోనూసూద్ ఒకరు. అరుంధతి మూవీలో వదల బొమ్మాలి అంటూ భయపెట్టినటువంటి నటుడిలో సాయగుణం ఉంది అంటే అదొక నమ్మలేని నిజంగా నిలుస్తుంది. కరోనా సమయంలో ఆయన చేసిన సాయం అనేది ఎప్పటికీ మరిచిపోలేనిది. చిత్తూరు జిల్లాలో ఒక రైతుకు చేసిన సాయం మరచిపోలేనిది.దానిని గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు సోను సూదిని అభినందించి సాయం పొందిన కుటుంబంలో ఆడపిల్లల్ని చదివించే బాధ్యత తాను తీసుకున్నారు. అయితే ప్రస్తుతం విజయవాడ పరిస్థితిని గమనించిన సోనూసూద్ మరలా తనలో ఉన్న మానవతావాదాన్ని చాటుకున్నారు.
ఆయన చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోవిడ్ టైం నుంచి ఎంతో మందికి సేవ చేస్తూ రీల్ హీరో కాదు రియల్ హీరో అనిపించుకున్నాడు. సోనూసూద్ మరోసారి తన మానవత్వాన్ని, దానత్వాన్ని చాటుకున్నాడు.తాజాగా ఆయన విజయవాడ, ఖమ్మంలలో వరదల ప్రభావంపై చలించిపోయి వెంటనే స్పందించారు.వరద బాధితులకు ఆహారం, తాగునీరు, మెడికల్ కిట్స్ అందించారు.ఇళ్లు కోల్పోయిన వారికి తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేసి దానికోసం తమ బృందం అవిశ్రాంతంగా పనిచేసేలా చేశారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు యుద్ధం చేస్తున్నాయని, ఆపదలో వారికి అండగా నిలుస్తామని సోనూసూద్ అనడంతో సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్ ప్రజలు తమ సహాయ అభ్యర్థనలను పంపడానికి ఇమెయిల్ చిరునామాను అందించింది. కాబట్టి అతను తన స్వచ్ఛంద సంస్థ ద్వారా సహాయం చేయడానికి, వనరులను పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు. సాయం కోసం ఎదురు చూస్తున్నవారు supportus@soodcharityfountion.org ను సంప్రదించండి అని తెలిపారు.అయితే సోనూసూద్ చేసిన పనికి ఏపీ సీఎం చంద్రబాబు గారు కృతజ్ఞతలు తెలిపితే దానికి సోనూసూద్ బదులిస్తూ.. ఆంధ్రా, తెలంగాణ ప్రజలు నా కుటుంబం సార్. మీ మార్గదర్శకత్వంలో మేము వారి జీవితాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము అన్నారు.అయితే సోనుసూద్ చేసిన పనికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయన ఈసారి అందరిలాగా సాయం అనేది సీఎం రిలీఫ్ ఫండ్ కు కాకుండా ఎవరికి అవసరం అనిపిస్తే వారు తనను డైరెక్టర్గా మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయితే మధ్యావర్తులు లేకుండా వారికే సాయం అందిస్తానని చెప్పడం విశేషం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>