PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jitta-balakrishna-reddy-is-no-more-his-history-is-thisc77cfb3a-c056-4828-9022-6466f39a1de2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jitta-balakrishna-reddy-is-no-more-his-history-is-thisc77cfb3a-c056-4828-9022-6466f39a1de2-415x250-IndiaHerald.jpgతెలంగాణలో తీవ్ర విషాదమైన సంఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీలో (BRS) నేత, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఈయన అకాల మరణం చెందారని తెలుసుకొని తెలంగాణ ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ రెడ్డి గత రెండు నెలలుగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఈ వ్యాధికి సంబంధించి హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. దీని నుంచి బయటపడే ఆయన మళ్ళీ మన ముందుకు వస్తారనJitta Balakrishna Reddy{#}Telangana Rashtra Samithi TRS;yadadri;Evening;District;YCP;Yuva;Friday;TDP;Assembly;Reddy;Government;Telangana;December;October;Degree;Balakrishna;School;Partyజిట్టా బాలకృష్ణారెడ్డి ఇక లేరు.. ఆయన చరిత్ర ఇదే..?జిట్టా బాలకృష్ణారెడ్డి ఇక లేరు.. ఆయన చరిత్ర ఇదే..?Jitta Balakrishna Reddy{#}Telangana Rashtra Samithi TRS;yadadri;Evening;District;YCP;Yuva;Friday;TDP;Assembly;Reddy;Government;Telangana;December;October;Degree;Balakrishna;School;PartyFri, 06 Sep 2024 13:00:00 GMTతెలంగాణలో తీవ్ర విషాదమైన సంఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీలో (BRS) నేత, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఈయన అకాల మరణం చెందారని తెలుసుకొని తెలంగాణ ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ రెడ్డి గత రెండు నెలలుగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఈ వ్యాధికి సంబంధించి హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. దీని నుంచి బయటపడే ఆయన మళ్ళీ మన ముందుకు వస్తారని చాలామంది ఆశించారు కానీ ఇవాళ ఉదయం ఆయన పరిస్థితి ఒకసారి కాదు విషమించింది దాంతో కన్నుమూశారు.

బాలకృష్ణ రెడ్డి చనిపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. స్వగ్రామమైన భువనగిరికి బాలకృష్ణారెడ్డి భౌతికకాయాన్ని తీసుకురానున్నారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు భువనగిరి శివారులోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంతక్రియలు నిర్వహించనున్నామని తెలిపారు. మరోవైపు ఉద్యమకారుడి మృతి పట్ల గులాబీ నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అతని ఎక్కడున్నా సరే ఆనందంగా ఉండాలంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

జిట్టా బాలకృష్ణారెడ్డి తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో కీ రోల్ ప్లే చేశారు. ప్రజా సంక్షేమం కోసం ఎప్పుడూ ఆయన పరితపిస్తుంటారు. ఇంత మంచి నేతను కోల్పోయినందుకుగాను ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు, ఆయన అనుచరులు, అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. బాలకృష్ణారెడ్డి భువనగిరి నియోజకవర్గంలోని అనేక గ్రామాలలో మంచినీటి సరఫరా వాటర్ ఫిల్టర్స్‌ ఏర్పాటు చేయించారు. అలా ఫ్లోరైడ్‌ బాధితులకు ఆయన ఒక దేవుడయ్యారు.ఆయన సొంత ఖర్చుతో గ్రామాల్లో ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు నిర్మించారు నేటికీ వాటి ద్వారా నేటిని తాగే ప్రజలు ఉన్నారు.

బాలకృష్ణా‌రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మాయిపల్లి గ్రామంలో 14 డిసెంబర్ 1972న జిట్టా పుట్టారు. ఆయన తల్లిదండ్రుల పేర్లు బాలరెడ్డి, రాధమ్మ. ఈ ఉద్యమ నేత  1987లో బీబీనగర్‌లోని గవర్నమెంట్ హై స్కూల్ లో టెన్త్ క్లాస్ పూర్తి చేశారు. 1989లో ఒక గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. 1993లో ఎల్‌బీ నగర్‌లోని డీవీఎం డిగ్రీ, పీజీ కళాశాల డిగ్రీ పట్టా పొందారు. తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా యాక్టివ్ అయిపోయారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత దానిలో చేరి తన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. తెరాస పార్టీ అనుబంధ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కొన్ని దినాలు పనిచేశారు.

2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చేసి ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు. టీడీపీ అభ్యర్థి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి చేతిలో కొన్ని ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. తర్వాత కాంగ్రెస్‌ పార్టీ, వైసీపీ కాంగ్రెస్‌లో జాయిన్ కావడం జరిగింది. మళ్లీ ఎందుకో ఆయన రెండు పార్టీల నుంచి బయటకు వచ్చారు. యువ తెలంగాణ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. 2022లో బీజేపీలో చేరారు. కొన్ని రోజులకు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. మళ్లీ 2023 అక్టోబర్ 20న తిరిగి జిట్టా బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>