PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/when-the-skies-open-up-andhras-leadership-braces-the-stormdefb10da-67cc-4e32-956e-25a804a40de9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/when-the-skies-open-up-andhras-leadership-braces-the-stormdefb10da-67cc-4e32-956e-25a804a40de9-415x250-IndiaHerald.jpgసాధారణంగా సీఎం స్థాయి వ్యక్తులు రాష్ట్రంలో ఎక్కడైనా వరదలు వస్తే ప్రత్యక్షంగా పర్యటించి వరద బాధితులకు సహాయం అందేలా చేయడం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. వరదలను లెక్క చేయకుండా పర్యటించే ముఖ్యమంత్రులు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి ముఖ్యమంత్రులలో చంద్రబాబు సైతం ఒకరని చెప్పవచ్చు. చంద్రబాబుకు నెటిజన్లు, వరద బాధితులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. chandrababu naidu{#}Aadhar;CBN;Government;CM;Andhra Pradeshహ్యాట్సాఫ్ సీఎం అంటున్న వరద బాధితులు.. బాబు సీఎంగా ఉండటం అదృష్టమంటూ?హ్యాట్సాఫ్ సీఎం అంటున్న వరద బాధితులు.. బాబు సీఎంగా ఉండటం అదృష్టమంటూ?chandrababu naidu{#}Aadhar;CBN;Government;CM;Andhra PradeshFri, 06 Sep 2024 07:40:00 GMTసాధారణంగా సీఎం స్థాయి వ్యక్తులు రాష్ట్రంలో ఎక్కడైనా వరదలు వస్తే ప్రత్యక్షంగా పర్యటించి వరద బాధితులకు సహాయం అందేలా చేయడం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. వరదలను లెక్క చేయకుండా పర్యటించే ముఖ్యమంత్రులు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి ముఖ్యమంత్రులలో చంద్రబాబు సైతం ఒకరని చెప్పవచ్చు. చంద్రబాబుకు నెటిజన్లు, వరద బాధితులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
 
విజయవాడలో పర్యటించడానికి చంద్రబాబు నాయుడు రావడం వల్లే అధికారులలో కదలిక వచ్చిందని చంద్రబాబు రాకుండా ఉండి ఉంటే అధికారులు వేగంగా పనులు చేసేవాళ్లు కాదనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో తాజాగా చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పిందనే సంగతి తెలిసిందే. మరోవైపు వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడుతోంది.
 
వరద బాధితులకు నిత్యావసర వస్తువులతో పాటు వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ జరుగుతోంది. 25 కిలోల బియ్యం, కిలో చక్కెర, 2 కిలోల బంగాళదుంపలు, 2 కిలోల ఉల్లిపాయలు, లీటర్ పామాయిల్ ప్రభుత్వం అందిస్తోంది. మొబైల్ రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే కూరగాయలను అందజేస్తోంది.
 
మృతుల కుటుంబాలకు చంద్రబాబు నాయుడు 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. పంట నష్టంపై అంచనాలు నమోదు చేయాలని ఎవరికి ఏ మెడిసిన్ కావాలన్నా అందుబాటులో ఉంచాలని చంద్రబాబు ఆదేశించారు. జ్వరాల నుంచి జాగ్రత్తలపై కరపత్రాల ద్వారా ప్రజలను చైతన్యపరచాలని చంద్రబాబు సూచనలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు లాంటి సీఎం ఉండటం ఏపీ ప్రజల అదృష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు మేలు జరిగేలా ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి హామీని అమలు చేసే దిశగా అడుగులు అయితే వేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>