MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5f8a802a-531d-4867-937e-0c4587e106b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5f8a802a-531d-4867-937e-0c4587e106b9-415x250-IndiaHerald.jpgవిక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అనిల్ , వెంకటేష్ కాంబినేషన్ లో రాబోయే సినిమాకు ఈ టైటిల్ నేమ్ ఎప్పటినుంచో వినిపిస్తున్నా కూడా.. ఇప్పటివరకైతే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సినిమా దిల్ రాజు బ్యానర్స్ పై తెరకెక్కబోతుంది. దిల్ రాజుకు సంక్రాంతి సమయం బాగానే కలిసి వస్తుంది . గతంలో కూడా ఈ సంక్రాంతికి ఈ బ్యానర్స్ పై వచ్చిన సినిమాలు భారీ సక్సెస్ ను అందుకున్నాయి. కాబట్టి.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు tollywood{#}anil music;Blockbuster hit;anil ravipudi;Kesari;F2;choudary actor;Venkatesh;Makar Sakranti;Comedy;Dil;king;lion;Success;aishwarya;Darsakudu;Cinema;Directorఅనిల్ రావిపూడి, వెంకీ మామ సినిమా ఎక్కడి వరకు వచ్చిందంటే..!?అనిల్ రావిపూడి, వెంకీ మామ సినిమా ఎక్కడి వరకు వచ్చిందంటే..!?tollywood{#}anil music;Blockbuster hit;anil ravipudi;Kesari;F2;choudary actor;Venkatesh;Makar Sakranti;Comedy;Dil;king;lion;Success;aishwarya;Darsakudu;Cinema;DirectorFri, 06 Sep 2024 15:40:00 GMTవిక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అనిల్ , వెంకటేష్ కాంబినేషన్ లో రాబోయే సినిమాకు ఈ టైటిల్ నేమ్ ఎప్పటినుంచో వినిపిస్తున్నా కూడా.. ఇప్పటివరకైతే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సినిమా దిల్ రాజు బ్యానర్స్ పై తెరకెక్కబోతుంది. దిల్ రాజుకు సంక్రాంతి సమయం బాగానే కలిసి వస్తుంది . గతంలో కూడా ఈ సంక్రాంతికి ఈ బ్యానర్స్ పై వచ్చిన సినిమాలు భారీ సక్సెస్ ను అందుకున్నాయి. కాబట్టి.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు అధికంగానే కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే వెంకటేష్ అనిల్ రావిపూడి

 కాంబినేషన్ లో f2 ,F3 అనే రెండు మూవీస్ తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి.అయితే ఈ రెండు సినిమాలలో వెంకటేష్ ,వరుణ్ తేజ్ కలిసి నటించారు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ ఇటీవల పొల్లాచ్చిలో జరిగింది. సుమారు 20 రోజుల పాటు జరిగిన చిత్రీకరణలో దాదాపు ఫస్టాఫ్ షూటింగ్‌ పూర్తయిపోయింది. ఇక ఈ సినిమా 2025 సంక్రాంతి బరిలో ఉన్నట్టు టీమ్‌ ఇప్పటికే రెండు, మూడుసార్లు చెప్పింది. ఇక ఈ సినిమాలో వెంకటేష్‌ సరసన మీనాక్షి చౌదరి  , ఐశ్వర్య రాజేష్‌  హీరోయిన్లుగా నటిస్తున్నారు. తొలి షెడ్యూల్‌ షూటింగ్‌లో వెంకటేశ్‌ పాల్గొన్నప్పుడు టీమ్‌ ఓ వీడియో రిలీజ్‌

 చేసింది. అందులో వెంకటేష్‌ లుంగీ కట్టి, కళ్లజోడుతో కొత్త లుక్‌లో కనిపించాడు. ''మాజీ పోలీసాఫీసర్‌ ఫుల్ ఎనర్జీతో తిరిగి తన డ్యూటీని మొదలుపెట్టాడు'' అని రాసుకొచ్చింది టీమ్‌. కాన్సెప్ట్‌ వింటుంటేనే వినోదం నిండుగా ఉండేలా కనిపిస్తోంది. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి గత ఏడాది నందమూరి నట సింహం బాలయ్య తో “భగవంత్ కేసరి “అనే సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.తనదైన మార్క్ కామెడీ అండ్ యాక్షన్ ఫిలిం గా తెరకెక్కించిన భగవంత్ కేసరి మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>