Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/joshf0076031-0c30-4413-b11c-39b231b73989-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/joshf0076031-0c30-4413-b11c-39b231b73989-415x250-IndiaHerald.jpg బడా స్టార్ హీరోల కొడుకులు సినిమాల్లోకి ఎంటర్ అవుతున్నారంటే వారి ఫస్ట్ మూవీ పై భారీ అంచనాలు ఉంటాయి, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అంతా అనుకుంటారు. కానీ అలా హిట్ కొట్టడం అనేది అంత సులభం ఏం కాదు. చాలామంది స్టార్ హీరోల కుమారులు సినిమాల్లో ఎంట్రీ చేయం ఫస్ట్ ఫస్టే ఫ్లాప్ అందుకున్నారు. నాగార్జున కొడుకు నాగచైతన్యకు కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురయ్యింది. ఆయన మొదటి సినిమా 'జాష్'. ఈ సినిమా కూడా చాలా బాగుంటుందని అంతా భావించారు. josh{#}Naga Chaitanya;Akkineni Nagarjuna;vasu varma;Music;Cinemaజోష్ సినిమాకి 15 ఏళ్లు.. ఈ డైలాగులు తెలుసుకుంటే మూవీ చూడాలనిపిస్తుంది..?జోష్ సినిమాకి 15 ఏళ్లు.. ఈ డైలాగులు తెలుసుకుంటే మూవీ చూడాలనిపిస్తుంది..?josh{#}Naga Chaitanya;Akkineni Nagarjuna;vasu varma;Music;CinemaFri, 06 Sep 2024 19:45:00 GMT

బడా స్టార్ హీరోల కొడుకులు సినిమాల్లోకి ఎంటర్ అవుతున్నారంటే వారి ఫస్ట్ మూవీ పై భారీ అంచనాలు ఉంటాయి, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అంతా అనుకుంటారు. కానీ అలా హిట్ కొట్టడం అనేది అంత సులభం ఏం కాదు. చాలామంది స్టార్ హీరోల కుమారులు సినిమాల్లో ఎంట్రీ చేయం ఫస్ట్ ఫస్టే ఫ్లాప్ అందుకున్నారు. నాగార్జున కొడుకు నాగచైతన్యకు కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురయ్యింది. ఆయన మొదటి సినిమా 'జాష్'. ఈ సినిమా కూడా చాలా బాగుంటుందని అంతా భావించారు. కానీ, అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా కూడా, కొంతమంది అభిమానులు ఈ సినిమాను ఇప్పటికీ ఇష్టపడతారు. ఈ సినిమా ఫ్లాప్ అయినందుకు కారణం, సినిమా విడుదలైన సమయం, ఇంకా కొన్ని ఇతర కారణాలు కూడా ఉండొచ్చు.

ఈ సినిమాలో నాగచైతన్య క్యారెక్టర్‌ని వాసు వర్మ చాలా బాగా రూపొందించారు. నాగచైతన్య ఈ పాత్రలో అద్భుతంగా నటించాడు. వాసు వర్మ ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ పెట్టినప్పటికీ, ఒక బలమైన మెసేజ్ కూడా ఇవ్వాలనుకున్నారు. ఆయన రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి, నాగచైతన్య వాటిని చాలా బాగా చెప్పారు. సంగీతం కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్. అసలు ఈ సినిమా రామ్ చరణ్‌తో చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. అందుకే నాగచైతన్య ఈ సినిమాతో డెబ్యూ చేశాడు. అయితే ఈ మూవీ పలు కారణాలవల్ల కమర్షియల్ గా ఫీల్ అయింది అయినా సరే దీన్ని చాలా మంది చూసుకుంటారు ఇందులోని డైలాగులు తమకు బాగా నచ్చాయని పేర్కొంటుంటారు. ఈ సినిమాలోని డైలాగ్స్ లైఫ్ లెసన్స్ నేర్పుతాయి. అవేవో తెలుసుకుందాం.

• కనీసం మేమైనా పాఠం చెప్పి పరీక్ష పెడతాం,
కానీ లైఫ్ అలా కాదు
పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది,
గుణపాఠం.

• ఇక్కడే హ్యాపీగా ఉండొచ్చు కదరా
ఇక్కడే ఉండమంటవా, హ్యాపీగా ఉండమంటవా.?


• లైఫ్‌లో జాగ్రత్తగా ఉండాలి.. బట్ లైఫ్ లేకుండా చేసుకోకూడదు.

• ఆ క్షమాపణ నేను భరించలేకపోయాను
అదే నాకు పెద్ద శిక్ష అయిపోయింది
నేను తట్టుకోలేకపోయాను.

• పేరెంట్స్ ప్రేమించడం తప్ప ఇంకేమి చేయలేరు,
సొసైటీ కూడా ఏమి చేయలేదు భరించడం తప్ప.

ఇలా ప్రతి డైలాగు ఒక డీప్ మీనింగ్ కలిగి ఉంటుంది. రాసినవి మామూలు మాటలే అయినా కూడా ఇవన్నీ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నా వారికి ఉపయోగపడతాయి. ఈ సినిమా గురించి ఎందుకు చెబుతున్నావ్ అంటే ఇది రిలీజ్ అయ్యే నేటికీ 15 ఏళ్లు అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>