MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda1ad625b-61b9-4b7b-b1bb-e7cad825e9ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda1ad625b-61b9-4b7b-b1bb-e7cad825e9ca-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌లో డ్యాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు పూరి జగన్నాథ్. విమర్శకులు సైతం ఆశ్చర్యపోయే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ మూటగట్టుకున్న విషయం తెలిసిందే. మరోవైపు వరుస సినిమాలతో ప్లాప్‌లతో కూరుకుపోయాడు హీరో రామ్ పోతినేని. ఎలాగైనా హిట్ కొట్టాలన్న ధ్యేయంతో పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమానే డబుల్ ఇస్మార్ట్. 2019లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కించారు. tollywood{#}puri jagannadh;Amazon;Audience;ismart shankar;News;Hero;Blockbuster hit;ram pothineni;septemberడబుల్ ఇస్మార్ట్ ఫ్లాప్.. రూట్ మార్చిన రామ్..!?డబుల్ ఇస్మార్ట్ ఫ్లాప్.. రూట్ మార్చిన రామ్..!?tollywood{#}puri jagannadh;Amazon;Audience;ismart shankar;News;Hero;Blockbuster hit;ram pothineni;septemberFri, 06 Sep 2024 16:55:00 GMTటాలీవుడ్‌లో డ్యాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు పూరి జగన్నాథ్. విమర్శకులు సైతం ఆశ్చర్యపోయే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ మూటగట్టుకున్న విషయం తెలిసిందే. మరోవైపు వరుస సినిమాలతో ప్లాప్‌లతో కూరుకుపోయాడు హీరో రామ్ పోతినేని. ఎలాగైనా హిట్ కొట్టాలన్న ధ్యేయంతో పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమానే డబుల్ ఇస్మార్ట్. 2019లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కించారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు బాగానే రెస్పాన్స్

 వచ్చింది. బాక్సాఫీస్ వద్ద  హీరో రామ్ పోతినేని   డబుల్ ఇస్మార్ట్‌ కలెక్షన్స్ పెద్దగా రాలేదు. ఈ నేపథ్యంలో  హీరో రామ్ పోతినేని  డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ రిలీజ్‌పై క్యూరియాసిటీ నెలకొంది. ఆ క్రమంలోనే సెప్టెంబర్ 27న ఓటీటీలోకి డబుల్ ఇస్మార్ట్ స్ట్రీమింగ్ కానుందని వార్తలు వినిపించాయి. కానీ, అనూహ్యంగా తాజాగా సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది డబుల్ ఇస్మార్ట్ మూవీ. ప్రస్తుతం రామ్ పోతినేని  సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ వైవిధ్యమైన దర్శకుడితో ఆయన చేతులు కలిపినట్టు ఫిల్మ్‌వర్గాల టాక్‌. ఆ దర్శకుడెవరో కాదు, 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' సినిమాతో డీసెంట్‌ హిట్‌ను అందుకున్న మహేశ్‌బాబు. ఆయన దర్శకత్వంలో త్వరలో రామ్‌

 నటించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. మైత్రీమూవీమేకర్స్‌ వారు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నదని వినికిడి.ఇకపోతే థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో  హీరో రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు . కాగా, డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ రూ. 33 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>