MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/venkeyaa452c45-9cc5-4c42-890d-44945f4114e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/venkeyaa452c45-9cc5-4c42-890d-44945f4114e8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం ఓ మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ ను మేకర్స్ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ మూవీ కి సంక్రాంతికి వస్తున్Venkey{#}aishwarya rajesh;choudary actor;F2;Sri Venkateshwara Creations;dil raju;anil ravipudi;Venkatesh;Box office;Makar Sakranti;Event;Cinemaవెంకీ కోసం పెద్ద ప్లాన్ వేసిన అనిల్.. దిల్ రాజు.. ఒక్క దెబ్బతో సినిమాపై అంచనాలు డబల్ కానున్నాయా..?వెంకీ కోసం పెద్ద ప్లాన్ వేసిన అనిల్.. దిల్ రాజు.. ఒక్క దెబ్బతో సినిమాపై అంచనాలు డబల్ కానున్నాయా..?Venkey{#}aishwarya rajesh;choudary actor;F2;Sri Venkateshwara Creations;dil raju;anil ravipudi;Venkatesh;Box office;Makar Sakranti;Event;CinemaThu, 05 Sep 2024 10:15:00 GMTటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం ఓ మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ ను మేకర్స్ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ మూవీ కి సంక్రాంతికి వస్తున్నాము అనే టైటిల్ ను ఆల్మోస్ట్ కన్ఫామ్ చేసినట్లు , ఇదే టైటిల్ ను మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆల్మోస్ట్ టైటిల్ అనుకున్న ఇంకా కూడా దానిని ప్రకటించకపోవడానికి ప్రధాన కారణం ఈ మూవీ యూనిట్ ఈ టైటిల్ అనౌన్స్మెంట్ కోసం ఓ భారీ ఈవెంట్ ను చేయబోతున్నట్లు , ఆ ఈవెంట్ లో భాగంగా ఈ మూవీ టైటిల్ ను విడుదల చేసి జనాల్లో ఈ సినిమాపై అంచనాలు పెంచేందుకు ఈ మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు అందులో భాగంగా మరికొంత కాలంలోనే ఓ భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేసి అందులో ఈ సినిమా టైటిల్ ను విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఇప్పటికే వెంకటేష్ , అనిల్ రావిపూడి , దిల్ రాజు కాంబో లో ఎఫ్ 2 , ఎఫ్ 3 అనే రెండు సినిమాలు రూపొందాయి. ఈ రెండు మూవీ లు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. దానితో వీరి కాంబోలో పొందుతున్న మూడవ సినిమా పై ప్రేక్షకుల్లో ప్రస్తుతానికి మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకొని , ఏ రేంజ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుందో చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>