Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0b3986db-5110-4e0e-9bb9-593d269e24b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0b3986db-5110-4e0e-9bb9-593d269e24b0-415x250-IndiaHerald.jpgమిల్కి బ్యూటీ ‘తమన్నా భాటియా’.. ఈ పాన్ ఇండియా హీరోయిన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. సుదీర్ఘకాలంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో ఈమె కూడా ఒకరు. ఇకపోతే తమన్నా.. తన 15 ఏళ్ల వయసులోనే వెండితెరపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదట తెలుగులో శ్రీ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఇక ఈ సినిమా తర్వాత.. హ్యాపి డేస్ మూవీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే హ్యాపి డేస్ సినిమా తర్వాత తమన్నా కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదుsocialstars lifestyle{#}Sridevi Kapoor;sree;Hyderabad;BEAUTY;tamannaah bhatia;Ram Gopal Varma;marriage;Heroine;Tollywood;media;House;India;Telugu;Cinemaపెళ్లిపై మిల్కీ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వైరల్..!!పెళ్లిపై మిల్కీ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వైరల్..!!socialstars lifestyle{#}Sridevi Kapoor;sree;Hyderabad;BEAUTY;tamannaah bhatia;Ram Gopal Varma;marriage;Heroine;Tollywood;media;House;India;Telugu;CinemaThu, 05 Sep 2024 17:30:00 GMTమిల్కి బ్యూటీ ‘తమన్నా భాటియా’.. ఈ పాన్ ఇండియా హీరోయిన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. సుదీర్ఘకాలంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో ఈమె కూడా ఒకరు. ఇకపోతే తమన్నా.. తన 15 ఏళ్ల వయసులోనే వెండితెరపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదట తెలుగులో శ్రీ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఇక ఈ సినిమా తర్వాత.. హ్యాపి డేస్ మూవీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే హ్యాపి డేస్ సినిమా తర్వాత తమన్నా కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. శ్రీ అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ. అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోలందరి సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తమన్నా విజయ్ వర్మ అనే నటుడితో ప్రేమలో పడి మునిగి తేలుతోంది. అయితే తమన్నా ప్రేమ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ ఆమె పెళ్లి ఎప్పుడు? అనే విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.తాజాగా మిల్కి బ్యూటీ తమన్నా.. హైదరాబాద్ లోని ఓ షాప్ ఓపెనింగ్ కార్యక్రమంకు హాజరైంది. కాగా, అక్కడ మీడియా ఈ బ్యూటీకి ఎప్పటి నుంచో మీ పెళ్లి గురించి పలు కథనాలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా.. సోషల్ మీడియాలో కూడా మీ పెళ్లిపై చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. కనుక మీ పెళ్లి గురించి ఏదైనా అప్డేట్ చెప్పండి అని అడగారు. ఇక ఆ ప్రశ్నకు తమన్నా మాట్లాడుతూ.. ‘ఇప్పటిలో నేను పెళ్లి చేసుకోవడం లేదు, కంగారు పడవద్దు’ అంటూ కామెంట్స్ చేసింది. అయితే ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. హైదరాబాద్ తనకు రెండో ఇల్లు లాంటిదని హీరోయిన్ తమన్నా తెలిపారు. ఒక కార్యక్రమం కోసం ఇక్కడ వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. విజయవర్మతో ప్రేమలో ఉన్న మిల్కీ బ్యూటీని పెళ్లి ఎప్పుడని జర్నలిస్టు ప్రశ్నించగా ఇప్పట్లో ఆలోచన లేదని స్పష్టం చేశారు. చీర కట్టులో శ్రీదేవి అందంగా ఉంటారు. నాతో పాటు ఈ జనరేషన్ అంతా ఆమెను ఫాలో అవుతున్నారు. చీరను భారత అమ్మాయిలే కాదు ప్రపంచమంతా అనుసరిస్తున్నారు. అని పేర్కొన్నారు.అయితే విజయ వర్మతో తమన్నా ప్రేమలో ఉన్న మాట వాస్తవమే కానీ ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఆమె అనుకోవడం లేదని తాజా కామెంట్స్ తో ఓ క్లారిటీ ఇచ్చింది. ఇక తమన్నాకి తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఆమె ఎక్కువగా హిందీలో సినిమాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. హిందీలో హీరోయిన్ గా మాత్రమే కాకుండా అతిథి పాత్రలు కూడా ఏమాత్రం కాదనకుండా చేసుకుంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>