Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle51c29adc-e667-40be-93bb-d29e9a11ae4b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle51c29adc-e667-40be-93bb-d29e9a11ae4b-415x250-IndiaHerald.jpgగుంటూరు కారం సినిమా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నా.. సూపర్ స్టార్ అభిమానులకు అది అంతగా కిక్ ఇవ్వలేదు. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. దాంతో మహేష్ బాబు నెక్ట్స్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న రాజమౌళి.. ఇప్పుడు మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భాsocialstars lifestyle{#}m m keeravani;Rajamouli;trivikram srinivas;RRR Movie;Red chilly powder;Kick;August;kushi;Kushi;INTERNATIONAL;India;mahesh babu;Rajani kanth;CBN;krishna;CinemaSSMB 29 : మహేష్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు.. దసరాకైనా అప్డేట్ వచ్చేనా..?SSMB 29 : మహేష్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు.. దసరాకైనా అప్డేట్ వచ్చేనా..?socialstars lifestyle{#}m m keeravani;Rajamouli;trivikram srinivas;RRR Movie;Red chilly powder;Kick;August;kushi;Kushi;INTERNATIONAL;India;mahesh babu;Rajani kanth;CBN;krishna;CinemaThu, 05 Sep 2024 10:45:00 GMTగుంటూరు కారం సినిమా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నా.. సూపర్ స్టార్ అభిమానులకు అది అంతగా కిక్ ఇవ్వలేదు. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. దాంతో మహేష్ బాబు నెక్ట్స్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న రాజమౌళి.. ఇప్పుడు మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా  జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఎస్ఎస్ యమ్ బి 29 వ సినిమాకు సంబంధించి వెనక పనులు జరుగుతున్నా దాని గురించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ బయటకు రావట్లేదు. దీని వెనక రాజమౌళి మాస్టర్ ప్లాన్ ఉందని టాక్. ఎప్పుడో మే చివర్లో సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే రోజు సినిమా అనౌన్స్ మెంట్ అన్నారు అది జరగలేదు. ఆగష్టు 9 మహేష్ బర్త్ డే రోజు ఏదైనా అప్డేట్ ఇస్తారని అనుకుంటే అది జరగలేదు.

మధ్యలో పండగలు వస్తున్నాయ్ వెళ్తున్నాయ్ కానీ మహేష్  29వ సినిమా గురించి ఏ న్యూస్ రాలేదు.
ఇక రాబోతున్న దసర మీద సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. సినిమా గురించి ఆరోజు ఏదైనా క్రేజీ అప్డేట్ వస్తుందని అనుకుంటున్నారు. కానీ మేకర్స్ మాత్రం ఇంకా సైలెంట్ గానే ఉంటున్నారు. ఓ పక్క మహేష్ తన మేకోవర్ లుక్స్ తో ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్నాడు.మహేష్ 29వ సినిమాలో ఇదివరకు ఎప్పుడు చూడని మహేష్ ని చూడబోతున్నామని తెలుస్తుంది.ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ నేపథ్యంతో తెరకెక్కే ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా విషయంలో రాజమౌళి ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. మరి దసరాకైనా అప్డేట్ ఇస్తే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి అయ్యే ఛాన్స్ ఉంది.ఇదిలావుండగా కేఎల్‌ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్ల టీమ్‌ ఆల్‌ రెడీ సెట్‌ అయ్యిందట. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎంఎం కీరవాణి ఫైనల్‌ అని తెలుస్తుంది. అలాగే మ్యూజిక్‌ పరంగా అంతర్జాతీయ టెక్నీషియన్ల సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందట. మరోవైపు సినిమాటోగ్రాఫర్‌గా పీఎస్‌ వినోద్‌, ఎడిటర్‌గా తమ్మిరాజు, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా మోహన్‌ నాథ్‌ బింగిని,  మరోవైపు వీఎఫ్‌ఎక్స్ కమల్‌ కన్నన్‌ లను ఎంపిక చేసినట్టు సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>