PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-s9356ee9c-c7a6-4c30-91b8-70d00e622a47-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-s9356ee9c-c7a6-4c30-91b8-70d00e622a47-415x250-IndiaHerald.jpgతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రేవంత్ రెడ్డి పై పొగడ్తల వర్షం కురిపించారు. విజయవాడ వరదలకు బుడమేరు కారణమైన సంగతి తెలిసిందే. ఈ బుడమేరు ఇంత పెద్ద విపత్తును కలిగించడానికి ప్రధాన కారణం ఆక్రమదారులే అని చెప్పుకోవచ్చు వీళ్లు ఈ వాగు డైవర్సిఫై అయ్యే పిల్ల కాలవలను మొత్తం ఆక్రమించుకున్నారు. ఆ కాలువ పక్కన కూడా ఇల్లు కట్టేశారు. దీనివల్ల అది వెళ్లిపోవడానికి ఎక్కువ ప్లేస్ త్వరగా వరద నీరు అంతా కూడా జనావాసాలను ముంచేత్తింది. Pawan Kalyan s{#}Pawan Kalyan;Varsham;kalyan;Revanth Reddy;House;Vijayawada;Government;CM;Telangana;Andhra Pradesh;YCPతెలంగాణ సీఎంపై పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం..?తెలంగాణ సీఎంపై పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం..?Pawan Kalyan s{#}Pawan Kalyan;Varsham;kalyan;Revanth Reddy;House;Vijayawada;Government;CM;Telangana;Andhra Pradesh;YCPThu, 05 Sep 2024 08:33:00 GMTతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రేవంత్ రెడ్డి పై పొగడ్తల వర్షం కురిపించారు. విజయవాడ వరదలకు బుడమేరు కారణమైన సంగతి తెలిసిందే. ఈ బుడమేరు ఇంత పెద్ద విపత్తును కలిగించడానికి ప్రధాన కారణం ఆక్రమదారులే అని చెప్పుకోవచ్చు వీళ్లు ఈ వాగు డైవర్సిఫై అయ్యే పిల్ల కాలవలను మొత్తం ఆక్రమించుకున్నారు. ఆ కాలువ పక్కన కూడా ఇల్లు కట్టేశారు. దీనివల్ల అది వెళ్లిపోవడానికి ఎక్కువ ప్లేస్ త్వరగా వరద నీరు అంతా కూడా జనావాసాలను ముంచేత్తింది.

పవన్ కల్యాణ్ దీని గురించి మాట్లాడుతూ హైడ్రా గురించి ప్రస్తావించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను ఆక్రమించిన భవనాలను కూలగొట్టి వాటిని రిస్టోర్ చేయడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చింది. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకురావడం అభినందనీయమని పవన్ కల్యాణ్ తాజాగా రేవంత్ రెడ్డి పై పొగడ్తలు కురిపించారు. "చెరువులను కాపాడే విషయంలో రేవంత్ రెడ్డి చాలా గొప్ప పని చేశారని" పవన్ అన్నారు. అక్రమ నిర్మాణాలనేవి లేకపోతే వరద విపత్తులు వచ్చే అవకాశమే ఉండదని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు..

హైడ్రా లాంటి కార్యక్రమంతో అక్రమ నిర్మాణాలు జరగకుండా అడ్డుకుంటే ప్రజలు వరదల్లో చిక్కుకోవాల్సిన దుస్థితి రాదని పేర్కొన్నారు. అక్రమార్కులపై చర్యల కోసం హైడ్రా లాంటివి ప్రతి రాష్ట్రం కూడా కంపల్సరీగా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే కట్టిన భవనాలకు పరిహారం ఇచ్చేసి ఆ తర్వాత వాటిని కూల్చేయాలని పేర్కొన్నారు. ఇంకో ప్రభుత్వం వచ్చినా అడ్డగోలుగా భూములను ఆక్రమించుకొని కట్టడాలు కట్టకుండా.. బ్యూరోక్రసీని కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని కూడా పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవన నిర్మాణ సమయంలో వాటిని విస్మరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని పవన్ పేర్కొన్నారు.  మానవతా దృక్పథాన్ని దృష్టిలో ఉంచుకుని నష్టపరిహారంతో ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో నిర్మాణాలను కూల్చివేయాలని సూచించారు. విపత్తు సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమర్ధవంతంగా స్పందించారని ప్రశంసిస్తూ వైసీపీ నేతలు విమర్శలు చేయకుండా సహాయక చర్యలపై దృష్టి సారించాలని కోరారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>