PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp57061a68-f9e1-4f03-9c30-fbf918e467fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp57061a68-f9e1-4f03-9c30-fbf918e467fe-415x250-IndiaHerald.jpg విలవిల లాడుతున్న పరిస్థితి. ఇలాంటి టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలు ఇబ్బందులు తొలగించేందుకు కష్టపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం విజయవాడలో వీధి వీధి తిరుగుతూ ప్రజలకు అండగా ఉంటామని ధైర్యం చెబుతున్నారు. ప్రభుత్వం తరఫున భరోసా కల్పిస్తున్నారు. ycp{#}Jagan;YCPవరద బాధితులను తిట్టిన వైసీపీ టాప్ లీడర్.. గో బ్యాక్ అంటూ షాక్ ఇచ్చిన విజయవాడ ప్రజలు..!వరద బాధితులను తిట్టిన వైసీపీ టాప్ లీడర్.. గో బ్యాక్ అంటూ షాక్ ఇచ్చిన విజయవాడ ప్రజలు..!ycp{#}Jagan;YCPThu, 05 Sep 2024 14:45:57 GMTఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలతో పలు నగరాలలో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. వరద ప్రభావంతో కట్టుకున్న బట్టలతో మిగిలిపోయారు. చాలా చోట్ల ధనవంతులు సైతం ఇళ్లు మునిగిపోవడంతో తినడానికి తిండి లేక.. తాగడానికి నీళ్లు లేక.. విలవిల లాడుతున్న పరిస్థితి. ఇలాంటి టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలు ఇబ్బందులు తొలగించేందుకు కష్టపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం విజయవాడలో వీధి వీధి తిరుగుతూ ప్రజలకు అండగా ఉంటామని ధైర్యం చెబుతున్నారు. ప్రభుత్వం తరఫున భరోసా కల్పిస్తున్నారు.


ఇలాంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అండగా ఉండాల్సింది పోయిన ప్రధాన ప్రతిపక్షం వైసిపి.. వరద రాజకీయం చేస్తూ.. ప్రజలతో ఛీ కొట్టించుకుంటుంది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి సైతం వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చి.. బుడమేరు వాగు కాదు.. బుడ‌మేరు న‌ది అని అభాసు పాలయ్యారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వరద బాధితులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో బాధితులందరూ కలిసి ఆ నాయకుడిని బయటకు పంపేశారు. ఎన్టీఆర్ జిల్లా, నందిగామ.. వైసిపి మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు బుధవారం వరద బాధితులను పరామర్శించేందుకు.. కంచికచర్ల వద్దకు వెళ్లారు.


బాధితులకు సరిగా సాయం అందించడం లేదంటూ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బాధ్యతలు తమకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు అంటూ చెప్పే ప్రయత్నం చేయబోగా.. వారిపై మాజీ ఎమ్మెల్యే ప‌రుష ప‌ద‌జాలంతో దూషించారు. నాలుగు రోజులుగా కూటమి నాయకులు అన్ని విధాలుగా సాయం అందిస్తుంటే.. ఇప్పుడు వచ్చి బురద రాజకీయం ఏంటని బాధితులు అందరూ ఆయనపై తిరగబడే ప్రయత్నం చేశారు. మొండితోక గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ జగన్మోహన్ రావును అక్కడ నుంచి పంపించి వేశారు. దీంతో వైసిపి నేత పరువు కాస్త పోయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>