MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan02b1e47f-463e-4284-bc25-f2c449904060-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan02b1e47f-463e-4284-bc25-f2c449904060-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్లో అనేక సినిమాలను వదులుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో చాలా మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే పవన్ కళ్యాణ్ ను అనుకున్న ఒక సినిమాలో మహేష్ బాబు నటించగా ... పవన్ కళ్యాణ్ కు కథ చెప్పిన అది నచ్చకపోవడంతో ఒక మూవీ లో మహేష్ బాబు నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా జరిగిన సినిమాలు ఏవో తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పోకిరి అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ భPawan{#}dil raju;mahesh babu;puri jagannadh;srikanth addala;Sri Venkateshwara Creations;Seethamma Vakitlo Sirimalle Chettu;Pokiri;kalyan;Venkatesh;Blockbuster hit;Industry;Box office;Cinemaఆ రెండు మహేష్ బ్లాక్ బస్టర్ మూవీలలో మొదట పవన్ ను హీరోగా అనుకున్న విషయం తెలుసా..?ఆ రెండు మహేష్ బ్లాక్ బస్టర్ మూవీలలో మొదట పవన్ ను హీరోగా అనుకున్న విషయం తెలుసా..?Pawan{#}dil raju;mahesh babu;puri jagannadh;srikanth addala;Sri Venkateshwara Creations;Seethamma Vakitlo Sirimalle Chettu;Pokiri;kalyan;Venkatesh;Blockbuster hit;Industry;Box office;CinemaThu, 05 Sep 2024 09:18:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్లో అనేక సినిమాలను వదులుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో చాలా మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే పవన్ కళ్యాణ్ ను అనుకున్న ఒక సినిమాలో మహేష్ బాబు నటించగా ... పవన్ కళ్యాణ్ కు కథ చెప్పిన అది నచ్చకపోవడంతో ఒక మూవీ లో మహేష్ బాబు నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా జరిగిన సినిమాలు ఏవో తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పోకిరి అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఏకంగా ఆల్ తిమీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ మూవీ కథను ముందుగా పూరీ జగన్నాథ్ , పవన్ కళ్యాణ్ కి వినిపించాడట. కాకపోతే ఆయనకు ఈ స్టోరీ నచ్చిన కూడా ఎందుకో పెద్దగా రెస్పాండ్ కాలేదట. దానితో ఏమి చేయలేక పూరి జగన్నాథ్ ఈ స్టోరీ ని మహేష్ కు చెప్పడం , ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమాను రూపొందించాడట. ఇకపోతే విక్టరీ వెంకటేష్ , మహేష్ బాబు హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దానర్ పై దిల్ రాజు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించిన విషయం మనకు తెలిసిందే. 

ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర కోసం మొదట దిల్ రాజు , పవన్ కళ్యాణ్ ను అనుకున్నాడట. కానీ పవన్ కళ్యాణ్ కు ఆ స్టోరీ చెప్పేలోపే ఒకానొక సందర్భంలో మహేష్ ను కలవడం , ఈ స్టోరీ చెప్పడం , అది ఆయనకు అద్భుతంగా నచ్చడంతో మహేష్ బాబు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా పవన్ కి చెప్పకుండానే పవన్ తో అనుకున్న సినిమా మహేష్ బాబుతో రూపొందిందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇకపోతే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>