MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/naga-chaitanya0083bb6c-3947-4954-a2fd-11f3f31c8786-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/naga-chaitanya0083bb6c-3947-4954-a2fd-11f3f31c8786-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. జోష్ సినిమాతో టాలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయమైన నాగచైతన్య ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను దక్కించుకున్నాడు. ఇక సినిమాలలో నటిస్తున్న సమయంలోనే సమంతను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. naga chaitanya{#}Naga Chaitanya;Akkineni Nagarjuna;shobitha;Kanna Lakshminarayana;Father;Josh;News;Tollywood;Hyderabad;Government;Cinemaశోభిత అడుగు మహిమ...వ్యాపారంలో కోట్లు సంపాదిస్తున్న అక్కినేని హీరో...?శోభిత అడుగు మహిమ...వ్యాపారంలో కోట్లు సంపాదిస్తున్న అక్కినేని హీరో...?naga chaitanya{#}Naga Chaitanya;Akkineni Nagarjuna;shobitha;Kanna Lakshminarayana;Father;Josh;News;Tollywood;Hyderabad;Government;CinemaWed, 04 Sep 2024 22:06:00 GMT
అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. జోష్ సినిమాతో టాలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయమైన నాగచైతన్య ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను దక్కించుకున్నాడు. ఇక సినిమాలలో నటిస్తున్న సమయంలోనే సమంతను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.


ఇక విడాకులు అనంతరం నాగచైతన్య శోభిత ధూళిపాళతో రిలేషన్ కొనసాగించాడు. కొన్ని ఏళ్ల పాటు సీక్రెట్ గా వీరి రిలేషన్ కొనసాగించిన నాగచైతన్య కుటుంబసభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ ను చాలా ప్రైవసీగా జరుపుకున్నాడు. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం నాగార్జున బాటలోనే తన కుమారుడు నాగచైతన్య పయనిస్తున్నాడు. సినిమా రంగంలో హీరోగా రాణిస్తూనే వ్యాపార రంగాలలో కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. తన తండ్రి నిర్వహించే వ్యాపారాలను చూసుకోవడమే కాకుండా తనకంటూ సొంతంగా ఓ వ్యాపారాన్ని ఏర్పరచుకున్నాడు. హైదరాబాద్ మాదాపూర్ లో 2022లో షోయు పేరుతో క్లౌడ్ కిచెన్ ను ప్రారంభించిన నాగచైతన్య మంచి లాభాలను సంపాదిస్తున్నాడు.


గవర్నమెంట్ గౌర్మెట్ సౌత్-ఈస్ట్-ఆసియన్ వంటకాలకు ఇది ప్రసిద్ధి చెందింది. పలు రకాల వంటకాలను ఆహార ప్రియులకు అందిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. అది తక్కువ సమయంలోనే హైదరాబాద్ లో ఉన్న టాప్-10 రెస్టారెంటలో షోయు రెస్టారెంట్ ఒకటిగా నిలిచింది. సినిమాల ద్వారా వచ్చే ఆదాయం కన్నా చైతన్య దీనిపైన ఎక్కువగా డబ్బులను సంపాదిస్తున్నాడు. ప్రతిరోజు ఈ కిచెన్ ద్వారా రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలపైనే ఆదాయం సంపాదిస్తున్నాడు.


వారాంతపు సెలవులు వస్తే దీని ఆదాయం రెట్టింపు అవుతోంది. ఏడాదికి షోయు ద్వారా నాగచైతన్య రూ. 10 నుంచి రూ. 12 కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడు. ముఖ్యంగా నాగచైతన్యకు శోభితతో ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత దీని ఆదాయం మరింతగా పెరిగిందని అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి. శోభిత రాకతో నాగచైతన్యకు బాగా కలిసి వచ్చిందని నాగచైతన్య అభిప్రాయపడుతున్నారట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>