Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunnyce1f50f0-fa56-4fa2-ad82-83a5ce1179e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunnyce1f50f0-fa56-4fa2-ad82-83a5ce1179e5-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో నచ్చలేదు అని రిజెక్ట్ చేసిన స్టోరీ తోనే మరో హీరో సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడం జరుగుతూ ఉంటుంది. ఇప్పటివరకు ఎంతో మంది హీరోల సినిమాల విషయంలో ఇలా జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ కూడా ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమా మరో హీరో వద్దకు వెళ్లడం.. ఇక ఆ సినిమా చేసి మరో హీరో హిట్టు కొట్టడం చూస్తూ ఉంటాం. అయితే ప్రతిసారి ఇలా రిజెక్టెడ్ స్టోరీ తో హిట్టు కొడతారూ అని మాత్రం చెప్పలేం అన్న విషయం తెలిసిందే. అయితే అప్పుడప్పుడు ఇలా ఒక స్టార్ హీరో రిజెక్ట్ చేసిన సిbunny{#}Rajani kanth;Hero;Blockbuster hit;Tollywood;Salman Khan;Allu Arjun;India;bollywood;Cinemaఏంటి.. అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాతో.. సల్మాన్ ఖాన్ హిట్టు కొట్టాడా?ఏంటి.. అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాతో.. సల్మాన్ ఖాన్ హిట్టు కొట్టాడా?bunny{#}Rajani kanth;Hero;Blockbuster hit;Tollywood;Salman Khan;Allu Arjun;India;bollywood;CinemaWed, 04 Sep 2024 21:15:00 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో నచ్చలేదు అని రిజెక్ట్ చేసిన స్టోరీ తోనే మరో హీరో సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడం జరుగుతూ ఉంటుంది. ఇప్పటివరకు ఎంతో మంది హీరోల సినిమాల విషయంలో ఇలా జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ కూడా ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమా మరో హీరో వద్దకు వెళ్లడం.. ఇక ఆ సినిమా చేసి మరో హీరో హిట్టు కొట్టడం చూస్తూ ఉంటాం. అయితే ప్రతిసారి ఇలా రిజెక్టెడ్ స్టోరీ తో హిట్టు కొడతారూ అని మాత్రం చెప్పలేం అన్న విషయం తెలిసిందే. అయితే అప్పుడప్పుడు ఇలా ఒక స్టార్ హీరో రిజెక్ట్ చేసిన సినిమాతో మరో హీరో హీరో హిట్టు కొట్టడానికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారిపోతూ ఉంటుంది.


 అయితే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గురించి కూడా ఇలాంటి ఒక విషయమే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు అల్లు అర్జున్ ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఎన్నో సూపర్ హిట్ లు కూడా కొట్టాడు. పుష్ప సినిమా సూపర్ హిట్ తో ఇండస్ట్రీని షేక్ చేసేసాడు. అయితే అల్లు అర్జున్ ఇప్పటివరకు ఎన్నో మూవీస్ స్టోరీలను కూడా రిజెక్ట్ చేశాడు. ఇక అలాంటి స్టోరీలతోనే మరో హీరో సినిమా తీసి హిట్టు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ ఇలా నచ్చలేదు అని రిజెక్ట్ చేసిన స్టోరీ తోనే సినిమా తీసిన బాలీవుడ్ హీరో సూపర్ హిట్ కొట్టేసాడట. ఈ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.



 బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయిజాన్ మూవీ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను తిరస్కరించిన వారిలో సౌత్ ఇండియా సూపర్స్టార్ రజనీకాంత్ తో పాటు టాలీవుడ్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నారట. ముందుగా రజినీకాంత్ తో ఈ మూవీ తీయాలని అనుకున్నాడట కబీర్ ఖాన్. స్టోరీ కూడా వినిపించాడట. కానీ ఇక రజిని రిజెక్ట్ చేయగా.. ఇదే స్టోరీ తో అల్లు అర్జున్ ను అప్రోచ్ అయ్యాడట కబీర్ ఖాన్. కానీ అల్లు అర్జున్ కి కూడా కథ నచ్చక.. రిజెక్ట్ చేయడంతో కొన్నాళ్లపాటు వేచి చూసి సల్మాన్ ఖాన్ దగ్గరికి.. ఈ కథతో వెళ్లగా సల్మాన్ కు కథ నచ్చి పట్టాలెక్కింది. ఇక ఈ మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>