MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgడిసెంబర్ మొదటివారంలో ‘పుష్ప 2’ విడుదల కావడం గ్యారెంటీ అని తెలిపోవడంతో ఈమూవీకి సంబంధించి పెండింగ్ షూటింగ్ పనులు చాల వేగంగా జరుగుతున్నాయి. ఈమూవీకి ఏర్పడిన క్రేజ్ రీత్యా ఈ మూవీ బిజినెస్ కూడ అంచనాలకు మించి జరుగుతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప 2’ హడావిడి ఈ సంవత్సరాంతంతో ముగిసిపోతుంది కాబట్టి వచ్చే సంవత్సరం ప్రారంభం నుండి బన్నీ చేయబోయే సినిమాల విషయమై మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. వాస్తవానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీ తో సినిమా చేస్తాడు అన్న ప్రచారం గత కొంతకాలంగా చాల వేగంగా alluarjun{#}trivikram srinivas;sandeep;Salman Khan;atlee kumar;Allu Arjun;Darsakudu;Director;India;bollywood;News;Cinemaస్థిరమైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్న అల్లు అర్జున్ !స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్న అల్లు అర్జున్ !alluarjun{#}trivikram srinivas;sandeep;Salman Khan;atlee kumar;Allu Arjun;Darsakudu;Director;India;bollywood;News;CinemaWed, 04 Sep 2024 09:31:00 GMTడిసెంబర్ మొదటివారంలో ‘పుష్ప 2’ విడుదల కావడం గ్యారెంటీ అని తెలిపోవడంతో ఈమూవీకి సంబంధించి పెండింగ్ షూటింగ్ పనులు చాల వేగంగా జరుగుతున్నాయి. ఈమూవీకి ఏర్పడిన క్రేజ్ రీత్యా ఈ మూవీ బిజినెస్ కూడ అంచనాలకు మించి జరుగుతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప 2’ హడావిడి ఈ సంవత్సరాంతంతో ముగిసిపోతుంది కాబట్టి వచ్చే సంవత్సరం ప్రారంభం నుండి బన్నీ చేయబోయే సినిమాల విషయమై మళ్ళీ చర్చలు మొదలయ్యాయి.



వాస్తవానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీ తో సినిమా చేస్తాడు అన్న ప్రచారం గత కొంతకాలంగా చాల వేగంగా జరుగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ మూవీస్ ఈమూవీని పాన్ ఇండియా స్థాయిలో చాల భారీ స్థాయిలో తీయడానికి ఇప్పటికే ప్రణాళికలు కూడ వేసింది. అయితే అట్లీ చెప్పిన కథ బన్నీకి పూర్తిగా నచ్చకపోవడంతో అట్లీ తన మనసు మార్చుకుని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ వాయిపు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.



ఈ మూవీలో మరో కీలకపాత్రలో కమలహాసన్ కూడ నటించబోతున్నాడని టాక్. దీనితో అల్లు అర్జున్ అట్లీ మూవీ ప్రాజెక్ట్ ఇక ఉండకపోవచ్చు అన్న గాసిప్పులు మొదలయ్యాయి. దీనితో ఇప్పుడు మళ్ళీ బన్నీ యూటర్న్ తీసుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ వైపు అడుగులు వేయడం ఖాయం అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం వైపు త్రివిక్రమ్ బన్నీని దృష్టిలో పెట్టుకుని ఒక సోషియో ఫ్యాంటసీ కథ వ్రాశాడనీ ఇప్పుడు ఆకథకు ఫైనల్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది అని అంటున్నారు.



వాస్తవానికి బన్నీ సందీప్ వంగాల కాంబినేషన్ లో ఒక మూవీ రావడానికి రంగం సిద్ధం అయినప్పటికీ సందీప్ వంగా చెప్పిన కథ బన్నీకి పూర్తిగా నచ్చలేదు అన్న గాసిప్పులు కూడ వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో అల్లు అర్జున్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయడం తప్ప మరొక మార్గం ప్రస్తుతానికి లేదు అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి అనుకోవాలి..










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>