Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay65f5e52a-6ce1-4d99-9504-3a274d2be8f4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay65f5e52a-6ce1-4d99-9504-3a274d2be8f4-415x250-IndiaHerald.jpgతమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. అయితే రజనీకాంత్ తర్వాత ఆ స్థాయికి ఎదగాలని ఎంతోమంది హీరోలు ప్రయత్నించినప్పటికీ.. కుదరలేదు. కానీ రజనీకాంత్ తో సమానంగా తమిళనాడు మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది విజయ్ అని చెప్పాలి. ఏకంగా అభిమానులు అతన్ని దళపతి విజయ్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. అతను తెరమీద కనిపించాడు అంటే చాలు మాస్ ప్రేక్షకులందరూ కూడా పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతూ ఉంటారు. తనదైన శైలిలో డాన్సులు యాక్షన్లు చేస్తూ ఇక ఇప్పుడు స్టార్ హీరోగా ప్రేక్షvijay{#}venkat prabhu;Rajani kanth;Tamilnadu;Hero;Dalapathi;Joseph Vijay;Tollywood;Mass;september;Cinemaవిజయ్ 'GOAT' సినిమా రిలీజ్.. ఉద్యోగులకు హాలిడే ఇచ్చిన కంపెనీ?విజయ్ 'GOAT' సినిమా రిలీజ్.. ఉద్యోగులకు హాలిడే ఇచ్చిన కంపెనీ?vijay{#}venkat prabhu;Rajani kanth;Tamilnadu;Hero;Dalapathi;Joseph Vijay;Tollywood;Mass;september;CinemaWed, 04 Sep 2024 22:00:00 GMTతమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. అయితే రజనీకాంత్ తర్వాత ఆ స్థాయికి ఎదగాలని ఎంతోమంది హీరోలు ప్రయత్నించినప్పటికీ.. కుదరలేదు. కానీ రజనీకాంత్ తో సమానంగా తమిళనాడు మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది విజయ్ అని చెప్పాలి. ఏకంగా అభిమానులు అతన్ని దళపతి విజయ్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. అతను తెరమీద కనిపించాడు అంటే చాలు మాస్ ప్రేక్షకులందరూ కూడా పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతూ ఉంటారు.



 తనదైన శైలిలో డాన్సులు యాక్షన్లు చేస్తూ ఇక ఇప్పుడు స్టార్ హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే దళపతి విజయ్ కి అటు టాలీవుడ్ లో కూడా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా డబ్ అయి ఇక్కడ మంచి విజయాలను సాధించాయి. అయితే ఇక ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే.సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది. వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో భారీ తారాగణం కూడా ఉంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి.



 అయితే సెప్టెంబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ఎన్నో కంపెనీలు ఇక రిలీజ్ డేట్ రోజున తన ఉద్యోగులందరికీ కూడా సెలవు ప్రకటిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇటీవలే పార్క్ క్విక్ అనే ఒక పార్కింగ్ కంపెనీ కూడా తమ ఉద్యోగులకి విజయ్ సినిమా రిలీజ్ సందర్భంగా సెలవు ప్రకటించింది. విజయ్ సర్ పై ఉన్న అభిమానానికి చిహ్నంగా అలాగే మా ఉద్యోగులలో ఉన్న అపారమైన ఉత్సాహానికి గుర్తుగా యాజమాన్యం.. ఇలా విజయ సినిమా విడుదల తేదీ రోజున ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని నిర్ణయించింది. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాం అంటూ చిత్ర బృందానికి విషెస్ తెలిపారు పార్క్ క్విక్ కంపెనీ యాజమాన్యం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>