PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kim-jong-un89d992f0-a7ca-49ab-a343-cbe98e5a655b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kim-jong-un89d992f0-a7ca-49ab-a343-cbe98e5a655b-415x250-IndiaHerald.jpgఉత్తర కొరియా ఈ దేశం పేరు వినగానే అందరికీ ఒక్కసారిగా వణుకు పుడుతుంది. ఎందుకంటే అది మన భూమి మీదనే ఉన్న మరొక ప్రపంచం. అక్కడి ప్రజలకు కూడా ఈ ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు ఉండవు. అంతర్జాతీయ వార్తలపై కూడా అవగాహన ఉండదు. కేవలం వారికి అక్కడి అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.... అతని కుటుంబ సభ్యుల గురించి మాత్రమే తెలుసు. kim jong un{#}Korea; South;Uri;INTERNATIONAL;mediaకిమ్ కర్కశం: వరదల ఎఫెక్ట్ 30 మంది అధికారులకు ఉరి....?కిమ్ కర్కశం: వరదల ఎఫెక్ట్ 30 మంది అధికారులకు ఉరి....?kim jong un{#}Korea; South;Uri;INTERNATIONAL;mediaWed, 04 Sep 2024 13:13:35 GMT
ఉత్తర కొరియా ఈ దేశం పేరు వినగానే అందరికీ ఒక్కసారిగా వణుకు పుడుతుంది. ఎందుకంటే అది మన భూమి మీదనే ఉన్న మరొక ప్రపంచం. అక్కడి ప్రజలకు కూడా ఈ ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు ఉండవు. అంతర్జాతీయ వార్తలపై కూడా అవగాహన ఉండదు. కేవలం వారికి అక్కడి అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.... అతని కుటుంబ సభ్యుల గురించి మాత్రమే తెలుసు.


అయితే ఉత్తర కొరియాలో ఇటీవల తీవ్రమైన స్థాయిలో వరదలు వచ్చిన సంగతి తెలిసిందే. కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో సుమారుగా 4వేల మందికి పైగా మరణించారు. అయితే వరదల వల్ల ప్రాణ నష్టాన్ని నివారించడంలో అక్కడి ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.


సుమారు 20 నుంచి 30 మంది అధికారులను ఉరితీయాలని ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు దక్షిణ కొరియా మీడియా పేర్కొంది. ఇటీవల చాగంగ్ ప్రావిన్స్ లో వచ్చిన వరదల వల్ల వేలాదిమంది మృత్యువాత పడ్డారు. అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించలేకపోయిన అక్కడి అధికారులకు మరణ దండ విధించాలని ఉత్తర కొరియాపై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి.


నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర కొరియా అధికారులు వెల్లడించారు. గత నెలలోనే వరద బాధిత ప్రాంతాలకు చెందిన 30 మంది అధికారులను ఉరి తీసినట్లు చోసూన్ టీవీకి చెందిన ఓ రిపోర్టులో వెళ్లడైంది. మరణశిక్ష విధించిన అధికారుల వివరాలను మీడియా వెల్లడించలేదు. అయితే ఉత్తరకొరియాలో ఇలాంటి కఠినమైన రూల్స్ కొత్తవేమీ కాదు. చాలాసార్లు ఇలాంటి రూల్స్ అమలు చేశారు అక్క డి అధ్యక్షులు కిమ్. అయితే తాజాగా వరదలు వచ్చినానే పద్యంలో ఉరిశిక్షలు కూడా అమలు చేస్తున్నారు అక్కడి అధ్యక్షుడు కిమ్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>