Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tamil-bigboss-host-ga-kamal-stanamlo-aa-star-natudud296f5ad-c4d2-4751-91cf-988b57563068-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tamil-bigboss-host-ga-kamal-stanamlo-aa-star-natudud296f5ad-c4d2-4751-91cf-988b57563068-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై బిగ్‏బాస్ రియాల్టీకి షోకు చాలా మంది అభిమానులు ఉన్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ షో విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే అన్ని భాషలలోనూ చాలా సీజన్స్ కంప్లీట్ కాగా.. ప్రస్తుతం తెలుగులో సీజన్ 8 రన్ అవుతుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ షోకు అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా తొలివారం నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు తమిళంలోనూ బిగ్‏బాస్ సీజన్ 8 స్టార్ట్ కానుంది. అయితే మొదటిsocialstars lifestyle{#}Akkineni Nagarjuna;vijay sethupathi;Bigboss;Kollywood;Yevaru;Master;Silambarasan;House;Tamil;Hero;October;septemberతమిళ్ బిగ్ బాస్ హోస్ట్ గా కమల్ స్థానంలో ఆ స్టార్ నటుడు..!!తమిళ్ బిగ్ బాస్ హోస్ట్ గా కమల్ స్థానంలో ఆ స్టార్ నటుడు..!!socialstars lifestyle{#}Akkineni Nagarjuna;vijay sethupathi;Bigboss;Kollywood;Yevaru;Master;Silambarasan;House;Tamil;Hero;October;septemberWed, 04 Sep 2024 23:35:06 GMTబుల్లితెరపై బిగ్‏బాస్ రియాల్టీకి షోకు చాలా మంది అభిమానులు ఉన్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ షో విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే అన్ని భాషలలోనూ చాలా సీజన్స్ కంప్లీట్ కాగా.. ప్రస్తుతం తెలుగులో సీజన్ 8 రన్ అవుతుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ షోకు అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా తొలివారం నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు తమిళంలోనూ బిగ్‏బాస్ సీజన్ 8 స్టార్ట్ కానుంది. అయితే మొదటి నుంచి అంటే 2017 నుంచి ఈ షోకు లోకనాయకుడు కమల్ హాసన్ హోస్టింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ షో నుంచి తప్పుకున్నారు కమల్. ప్రస్తుతం చేతి నిండా సినిమాలు, షూటింగ్స్ అంటూ బిజీగా ఉండడంతోనే కమల్ ఈ షో నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది.దీంతో కొత్త బిగ్ బాస్ షోకి ఎవరు హోస్ట్ గా వ్యవహరిస్తారనే ప్రశ్న తలెత్తింది. కమల్ స్థానంలోకి కోలీవుడ్ హీరో శింబు వస్తాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత హీరో విజయ్ సేతుపతి పేరు వినిపించింది. తాజాగా బిగ్‏బాస్ సీజన్ 8 హోస్టింగ్ పై అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. తమిళ్ బిగ్ బాస్ ఫ్యాన్స్ కు నిర్వాహకులు షాక్ ఇచ్చారు. త్వరలో మొదలయ్యే సీజన్ 8 కి కమల్ హాసన్ స్థానంలో విజయ్ సేతుపతి హోస్టింగ్ చేస్తారని ప్రకటించారు. పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కారణంగా కమల్ తప్పుకున్నట్లు వెల్లడించారు. దీంతో కమల్ స్థానాన్ని విజయ్ సేతుపతి ఏ విధంగా భర్తీ చేస్తారోనన్న ఆసక్తినెలకొంది. కాగా విజయ్ సేతుపతి గతంలో మాస్టర్ చెఫ్ తమిళ్ కు కూడా హోస్టుగా వ్యవహరించారు.తమిళం బిగ్‏బాస్ సీజన్ 8కు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హోస్టింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. తాజాగా విడుదలైన ప్రోమోలో విజయ్ సేతుపతి మరింత స్టైలీష్ గా కనిపించారు. అలాగే బిగ్‏బాస్ షో లోగో కూడా అభిమానులను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు.బిగ్ బాస్ తమిళ్ 8 అక్టోబర్ నెలలో ప్రారంభం కానుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>