MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/megha-akash5599b418-b3c8-44b6-902e-c9bf77b1e003-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/megha-akash5599b418-b3c8-44b6-902e-c9bf77b1e003-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ మేఘా ఆకాష్ గురించి తెలియని వారుండరు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకుంది టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ మేఘా ఆకాష్. నితిన్ లై సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. చలో మోహనరంగ, రాజరాజ చోర, డియర్ మేఘతో పాటు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ అవ్వలేకపోయింది. Megha Akash{#}akash;prema;Lie;Heroine;vishnu;Party;BEAUTY;Love;Success;media;Tamil;Tollywoodశ్రీలంకలో టాలీవుడ్ హీరోయిన్ బ్యాచిలర్ పార్టీ...?శ్రీలంకలో టాలీవుడ్ హీరోయిన్ బ్యాచిలర్ పార్టీ...?Megha Akash{#}akash;prema;Lie;Heroine;vishnu;Party;BEAUTY;Love;Success;media;Tamil;TollywoodTue, 03 Sep 2024 10:01:00 GMT
టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ మేఘా ఆకాష్ గురించి తెలియని వారుండరు.  తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకుంది టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ మేఘా ఆకాష్. నితిన్ లై సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. చలో మోహనరంగ, రాజరాజ చోర, డియర్ మేఘతో పాటు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ అవ్వలేకపోయింది.


తన అందంతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నప్పటికీ తన నటనకు పెద్దగా గుర్తింపు రాలేదు. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోయినప్పటికీ మేఘా ఆకాష్ కు తమిళంలో మంచి అవకాశాలు వస్తున్నాయి. కాగా ఈ బ్యూటీ వివాహం చేసుకోబోతున్నట్లు తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. సాయి విష్ణు అనే అబ్బాయితో మేఘా ఆకాష్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఫోటోలను మేఘా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసుకుంది.


వీరిద్దరిదీ ప్రేమ వివాహం. గత ఆరేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఈ ఏడాది చివర్లో వివాహం చేసుకోబోతున్నారు. ఇదిలా ఉండగా....ప్రస్తుతం ఈ బ్యూటీ బ్యాచిలర్ పార్టీ కోసం తన స్నేహితులతో కలిసి శ్రీలంకకు వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. శ్రీలంకలో తన స్నేహితులతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసుకుంది. వధువు కానున్నట్లు ఒక స్పెషల్ పార్టీ కూడా అక్కడ జరిగిందట.

ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న మేఘా అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.ప్రస్తుతం మేఘ వయసు 28 సంవత్సరాలు. తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈ బ్యూటీ ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా తన ఖాతాలో వేసుకోలేదు. దీంతో ఈ బ్యూటీ తన వ్యక్తిగత జీవితంపై ఫోకస్ పెట్టింది. తాను ప్రేమించిన వ్యక్తిని కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకుంటుంది. ఇక వివాహమైన అనంతరం మేఘా ఆకాష్ సినిమాల్లో నటిస్తుందో లేదో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>